Breaking News

హర్యానా కౌంటింగ్‌ అప్‌డేట్‌లో జాప్యం.. ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

Published on Tue, 10/08/2024 - 14:04

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. రౌండ్ రౌండ్‌కు అంచనాలు మారుతున్నాయి. హర్యానాలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందంటూ అన్నీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేయగా.. ఫలితాలు అందుకు విరుద్దంగా వెలువడుతున్నాయి. ఫలితాల్లో తొలుత  కాంగ్రెస్ దూసుకెళ్లగా తరువాత ఢీలా పడింది. అతితక్కువ స్థానాల్లో లీడ్‌లో ఉన్న బీజేపీ ఒక్కసారిగా పుంజుకుంది. ఉత్కంఠ భరితంగా సాగుతున్న పోరులో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తుంది.

అయతే తమదే గెలుపు అంటూ ధీమాగా ఉన్న కాంగ్రెస్‌కు హర్యానా ఫలితాలు షాక్‌ను ఇవ్వడంతో.. ఎన్నికల ఫలితాలు వెల్లడించడంలో ఆలస్యం జరుగుతోందంటూ హస్తం పార్టీ మంగళవారం మధ్యాహ్నం ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఉదయం 9 మరియు 11 గంటల మధ్య ఈసీ వెబ్‌సైట్‌లో ఫలితాల అప్‌డేట్‌ లేదని, మందకొడిగా సాగుతోందని  లేఖలో పేర్కొంది.

మీడియాలో వస్తోన్న ఫలితాల సరళితో పోల్చినప్పుడు ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ ఆలస్యంగా ఉంటుందని తెలిపింది. వెబ్‌సైట్‌ను వాస్తవమైన, ఖచ్చితమైన గణాంకాలతో అప్‌డేట్ చేయాలంటూ తమ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని ఈసీని కోరింది. దీనివల్ల హానికరమైన తప్పుడు వార్తలను నివారించవచ్చని తెలిపింది.

మరోవైపు ఈసీ వెబ్‌సైట్‌ అప్‌డేట్‌లో జాప్యంపై కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ విమర్శలు గుప్పించారు. ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమయంలో మాదిరిగానే.. హర్యానా కౌంటింగ్  ఫలితాల సరళిని కూడా ఎప్పటికప్పుడు ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయడంలో జాప్యం కనిపిస్తోంది. కాలం చెల్లిన, తప్పుదోవ పట్టించే ట్రెండ్స్‌ను షేర్ చేస్తూ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చేలా బీజేపీ ప్రయత్నిస్తోందా..?ఈ అంశంపై ఇసికి ఫిర్యాదు చేశాం.  మా ప్రశ్నలకు ఈసీ సమాధానమిస్తుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)