Breaking News

ఎమ్మెల్యేలనే కొనే వారికి.. ఉల్లిపాయలు కొనడం తెలీదా?

Published on Thu, 11/05/2026 - 06:58

సాక్షి, చెన్న: శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ సోషల్‌ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం విజయ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేషన్‌ షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసిన ఉల్లిపాయల వ్యవహారంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తెలిసిన డమ్మీ సీఎంకి ఉల్లిపాయలు కొనడం తెలీదా? అని ప్రశ్నించారు. సహకార శాఖ ద్వారా ఈ ప్రభుత్వం ఉల్లిపాయలను కొనుగోలు చేసిన తీరే వీరి అసమర్థతకు అద్దం పడుతోందని మండి పడ్డారు. ఎటువంటి ముందస్తు నాణ్యతా పరిశీలన లేకుండా నేషనల్‌ అగ్రికల్చరల్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ నుండి 450 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేశారని మండిపడ్డారు. 

రైల్వే టెర్మినల్‌లోనే వదిలేశారు.. 
మహారాష్ట్ర నుండి రైలులో వచ్చిన ఆ ఉల్లిపాయలు పూర్తిగా కుళ్ళిపోయి, నిరుపయోగంగా ఉండటంతో ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు కొరుక్కుపేటై రైల్వే టెర్మినల్‌లోనే అధికారులు వదిలేశారని ఆయన ఆరోపించారు. దుర్గంధం వస్తుండటంతో, ఆ ఉల్లిపాయలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని  అబద్ధాలు ప్రచారం చేయడం విచారకరంగా పేర్కొన్నారు. కుళ్ళిపోయిన ఆ ఉల్లిపాయలలో కొంత భాగాన్ని తిరుచ్చి గాంధీ మార్కెట్‌లో విక్రయించడానికి లారీల్లో పంపారని, అయితే వ్యాపారులు ఆ ఉల్లిపాయలను చూడకుండా కొనలేమని నిరాకరించడంతో లారీ డ్రైవర్లు ఏమి చేయాలో తోచక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు.. 
ఒకవైపు ఉల్లి ధరలు పెరిగి ప్రజలు కన్నీళ్లు పెడు తుంటే, ఎలాంటి పట్టింపు లేకుండా ఉప ఎన్నికల పనుల్లో బిజీగా మారిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో రేషన్‌ షాపుల్లో  రూ30 కే పొన్ని బియ్యం ఇస్తామని చెప్పి, టెండర్లు లేకుండా సాధారణ బియ్యాన్నే పాలిష్‌ చేసి అమ్ముతున్న వ్యవహారంపై తాను ప్రశి్నస్తే సమాధానం చెప్పకుండా దాటవేశారని గుర్తుచేశారు. ఈ నాసిరకం ఉల్లిపాయల కొనుగోలుకు బాధ్యులెవరో, దీనిని కప్పిపుచ్చేందుకు ప్రయతి్నంచిన వారెవరో సీఎం సమాధానం చెప్పాలని ఉదయనిధి స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు.   

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)