Breaking News

మరోసారి మ‌త‌ప‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన ఉదయనిధి స్టాలిన్‌

Published on Fri, 12/20/2024 - 14:04

స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాలంటూ గ‌తేడాది వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి పోలీసు కేసులు ఎదుర్కొన్న త‌మిళ‌నాడు ఉప ముఖ్య‌మంత్రి, డీఎంకే పార్టీ యువ‌నేత ఉద‌య‌నిధి స్టాలిన్ మ‌రోసారి మ‌త‌ప‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. చెన్నైలో గురువారం జరిగిన క్రిస్మస్‌ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. తనను తాను గర్వించదగిన క్రైస్తవుడిగా ప్రకటించుకున్నారు. త‌న‌కు అన్ని మ‌తాలు స‌మాన‌మ‌ని, మత సామరస్యానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. మతం పేరుతో విభజించేవారిని, విద్వేషాన్ని చిమ్మేవారికి తాను వ్యతిరేకమని స్ప‌ష్టం చేశారు. 

నాకు అన్ని మతాలు సమానం
‘గత ఏడాది క్రిస్మస్‌ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నేను క్రిస్టియన్‌నని సగర్వంగా చెప్పాను. ఇది పలువురు సంఘీలకు చిరాకు తెప్పించింది. ఈ రోజు మళ్లీ చెబుతున్నా. నేను గర్వించదగిన క్రైస్తవుడిని. నేను క్రిస్టియన్‌ని అని మీరు అనుకుంటే, క్రిస్టియన్‌ని. ముస్లింనని మీరు అనుకుంటే, ముస్లింను. హిందువు అనుకుంటే, నేను హిందువును. నాకు అన్ని మతాలు సమానం. అన్ని మతాలు మనకు ప్రేమను చూపించడ‌మే నేర్పుతాయి’అని నొక్కి చెప్పారు.

బీజేపీ–అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తు
మతాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకునే వారు విద్వేషాలు, విభజనను వ్యాప్తి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి ఆరోపించారు. ‘ఇటీవల అలహాబాద్‌కు చెందిన ఓ న్యాయమూర్తి ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడటం చూశాం. ఆయన ముస్లింలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి న్యాయమూర్తి పదవిలో ఉంటే ఆయన కోర్టులో న్యాయం ఎలా ఆశిస్తాం?’ అని ప్రశ్నించారు. 

ఆయనను తొలగించడానికి లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు సంతకాలు చేసినా, అన్నాడీఎంకే ఎంపీలు మాత్రం సంతకాలు చేయలేదన్నారు. ‘‘బీజేపీకి బానిసలుగా కొనసాగుతున్నారు కాబట్టే.. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన న్యాయమూర్తిని తొలగించాలని కోరుతూ చేసిన తీర్మానానికి అన్నాడీఎంకే మద్ధతివ్వలేదు’’ అని అన్నాడీఎంకేను విమర్శించారు.

చ‌ద‌వండి: మీరూ ఏదో ఒకరోజు సీఎం అవుతారు

బీజేపీ–అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తు కొనసాగుతోందని, రాజ్యాంగ విలువల కంటే రాజకీయ విధేయతకే అన్నాడీఎంకే ప్రాధాన్యమిస్తోందని ఆయన ఆరోపించారు.  కాగా, స‌నాత‌న ధ‌ర్మంపై గ‌తేడాది ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయ‌నపై చాలా చోట్ల పోలీసు కేసులు న‌మోద‌య్యాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)