Breaking News

ఈడీ నోటీసులు.. సంబంధం లేదన్న గంగుల

Published on Wed, 09/06/2023 - 07:43

సాక్షి, కరీంనగర్‌: తన కుటుంబ సభ్యులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు అందించిందన్న పరిణామంపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పందించారు. తనకు నోటీసులేవీ రాలేదని.. నోటీసులు అందుకున్నట్లుగా చెబుతున్న శ్వేతా గ్రానైట్స్‌తో తనకేలాంటి సంబంధం లేదని అంటున్నారాయన. 

గంగుల కుటుంబ సభ్యుల కు చెందిన శ్వేతా గ్రానైట్స్‌ విదేశాలకు ఎగుమతుల విష యంలో ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ అంశంపై ఈడీ వివరణ కోరినట్లు తెలియవచ్చింది. గతేడాది నవంబర్‌లో శ్వేతా గ్రానైట్స్‌ సంస్థలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం తెలిసిందే. చైనాకు గ్రానైట్‌ ఎగుమతుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం రూ. 4.8 కోట్ల మేర ఫెమా నిబంధనల ఉల్లంఘనతోపాటు ప్రభుత్వానికి రూ. 50 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 3 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు ఈ అంశంపై మంత్రి గంగుల మంగళవారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఈడీకి సంబంధించి తనకు నోటీసులేవీ రాలేదని, శ్వేతా గ్రానైట్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారమే శ్వేతా గ్రానైట్స్‌ లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. శ్వేతా గ్రానైట్స్‌కు ఈడీ నోటీసులనేవి 2008 నుంచి కొనసాగుతున్నవేనన్నారు. ఈ విషయంలో ఆ సంస్థ వ్యాపారం గురించి లేదా తన గురించి ఈడీకి ఎలాంటి సమాచారమైనా ఇస్తానని, పూర్తిగా సహకరిస్తానని మంత్రి సమాధానమిచ్చారు. 

ఇదీ చదవండి: ప్రసవాల్లో రికార్డు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)