Breaking News

టీ కాంగ్రెస్‌ బిగ్‌ప్లాన్‌.. అంతా ఆయన చేతుల్లోనే!

Published on Sat, 12/02/2023 - 11:23

సాక్షి, హైదరాబాద్‌: డీకే శివకుమార్‌.. కర్ణాటక ఎన్నికల ఫలితాల సమయాల్లో, అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడల్లా ఎక్కువగా వినిపించే పేరు. నెగ్గిన అభ్యర్థుల్ని జంప్‌ కాకుండా.. సంక్షోభ సమయాల్లో పార్టీ ఎమ్మెల్యేలను ఏకతాటిపై ఉంచడంలో ఈయన ఎక్స్‌పర్ట్‌. అందుకే పాలిటిక్స్‌లో ట్రబుల్‌ షూటర్‌ అనే పేరొచ్చింది ఆయనకి. క్లిష్టపరిస్థితుల్లో పార్టీని ఆదుకునే డీకేఎస్‌.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కట్టబెట్టిన విజయం కాంగ్రెస్‌కు మరువలేనిది.  ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న  వేళ..  కాంగ్రెస్‌ అధిష్టానం ఆయన సేవల్ని మళ్లీ వినియోగించుకుంటోంది.  

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు డీకేఎస్‌ను నమ్ముకుంది. తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి ప్రచారంలో పాల్గొన్నారాయన. కర్ణాటక సంక్షేమ రిఫరెన్స్‌తో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారాయన. ఇప్పుడు.. రేపు ఫలితాల సమయంలో ఆయన ఇక్కడే మకాం వేసి చక్రం తిప్పబోతున్నారు. 

మ్యాజిక్‌ ఫిగర్‌కు అటు ఇటుగా ఫలితాలు ఉంటే.. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా బాధ్యత ఆయన చేతుల్లోకి వెళ్లింది.  తెలంగాణ ఫలితాలు వెలువడ్డాక.. ఆ నెగ్గిన వాళ్లను బెంగళూరుకు తరలిస్తారనే ప్రచారం ఒకటి తొలుత నడిచింది. అయితే ఆ ఊహాగానాల్ని స్వయంగా డీకేఎస్‌ కొట్టిపారేశారు.  ఎమ్మెల్యేలను ఎక్కడికి తరలించబోమని.. ఆ అవసరం లేదని అన్నారాయన. అలాగే.. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడుతుండగా.. అంతకు ఒక్కరోజు ముందే ఆయన హైదరాబాద్‌లో ల్యాండ్‌ కానున్నారు.

కాంగ్రెస్‌ బిగ్‌ప్లాన్‌
ఫలితాల రోజున తెలంగాణ కాంగ్రెస్‌ బిగ్‌ప్లాన్‌ అమలు చేయబోతోంది. ఏఐసీసీ ప్రతీ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడ్ని నియమించింది. సదరు అభ్యర్థి నెగ్గాక.. ఎమ్మెల్యే సర్టిఫికెట్‌తో ఆ పరిశీలకుడు నేరుగా హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణా హోటల్‌కు తీసుకొస్తారు. అక్కడ డీకేఎస్‌ సమక్షంలోనే వాళ్లు ఉండనున్నారు. ఒకవేళ సంపూర్ణ మెజారిటీ వచ్చినా కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని డీకేఎస్‌ భావిస్తున్నారట. ఎమ్మెల్యేలను ఎట్టిపరిస్థితుల్లో ప్రలోభాలకు గురి కాకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడే ఆయన స్వయంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

‘‘తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది. మాకు పూర్తి మెజారిటీ వస్తుంది. మేం ఎలాంటి క్యాంపు రాజకీయాలు పెట్టడం లేదు. కొంత మంది మా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మాకు సమాచారం ఉంది. కానీ, మా వాళ్లు పార్టీకి విధేయులు. లొంగరు..’’ డీకేఎస్‌ తాజాగా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇది. 

ఇదీ చదవండి: ఆగమెందుకు.. మళ్లీ మనమే

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)