Breaking News

TS Elections: నవంబర్ 9న కేసీఆర్‌ నామినేషన్లు

Published on Mon, 10/09/2023 - 17:45

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించడంతో.. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ తమ పార్టీ ప్రచార షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భేటీ కానున్నారు. అదే రోజు బీఫామ్స్‌ను అభ్యర్థులకు అందజేయడంతో పాటు మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. 

ఇక బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. నాలుగు రోజుల పాటు‍ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అక్టోబర్ 15., 16., 17.,18 తేదీల్లో ఈ టూర్‌ ఖరారైంది.  15వ తేదీ బీఫామ్స్‌ అందజేసి.. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల చేస్తారు కేసీఆర్‌. అదే రోజు.. హుస్నాబాద్ నియోజకవర్గంలో సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ మరుసటి రోజు అక్టోబర్ 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో, 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో, అక్టోబర్ 18వ తేదీన మధ్యాహ్నం జడ్చర్లలో.. అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్‌ పాల్గొంటారు.

ఇక.. నవంబర్‌ 9వ తేదీన గజ్వేల్‌, కామారెడ్డిలో ఆయన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.  ఆనవాయితీ ప్రకారం ఆ తేదీన ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు వేసి నామినేషన్‌ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నాం కామారెడ్డికి వెళ్లి మరో నామినేషన్‌ వేస్తారు. ఆపై అక్కడి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)