Breaking News

తెలంగాణ బీజేపీ.. రఘునందన్‌, అర్వింద్‌కు కీలక బాధ్యతలు!

Published on Wed, 07/26/2023 - 10:45

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ స్పీడ్‌ పెంచింది. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మరోవైపు.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈనెల 29వ తేదీన తెలంగాణకు రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, అమిత్‌ షా పర్యటనకు రాష్ట్ర బీజేపీ సన్నాహాలు చేస్తోంది. 

ఇదిలా ఉండగా.. ఇటీవల పార్టీ నేతల్లో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా పరిస్థితిని చక్కదిద్దేపనిలో రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి బిజీగా ఉన్నారు. ఇక, అమిత్‌ షా పర్యటన సందర్భంగా డాక్టర్స్‌, లాయర్స్‌, ఇంజినీర్స్‌ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వార్‌ రూమ్‌ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వార్‌ రూమ్‌ ఇన్‌చార్జ్‌గా ఎవరిని పెడతారనే దానిపై చర్చ జరుగుతోంది. 

మరోవైపు.. స్ట్రాటజీ టీమ్‌ ఇన్‌చార్జ్‌గా శ్వేతా శాలిని, సోషల్‌ మీడియా బాధ్యతలు ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యే రఘునందన్‌, కో ఆర్డినేషన్‌ కమిటీ బాధ్యతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతలకు అప్పగించారు. కాగా, దీనిపై రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే బీజేపీ హైకమాండ్‌పై రఘునందన్‌ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్‌.. బీజేపీలోకి సీనియర్‌ నేతలు! 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)