Breaking News

ప్రత్యేక ఏర్పాట్ల కోసం టాన్స్‌ జెండర్‌ అభ్యర్థి ధర్నా

Published on Sat, 05/25/2024 - 13:48

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో ఆరో దశ పోలింగ్‌ నేడు(శనివారం) జరుగుతోంది. ఈ నేపధ్యంలో పలు చోట్ల ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దక్షిణ ఢిల్లీకి చెందిన ఏకైక ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి రాజన్ సింగ్ పోలింగ్ బూత్ వద్ద నిరసన ప్రదర్శన  చేపట్టారు.

రాజన్ సింగ్ ఓటు వేసేందుకు సంగం విహార్‌లోని జె బ్లాక్‌లో గల ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ బూత్ నంబర్ 125కి వచ్చారు. అయితే  అక్కడ ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక ఏర్పాట్లు లేవన్న కారణంతో రాజన్  ఓటు వేయడానికి నిరాకరించారు. పోలింగ్‌ కేంద్రం బయట ధర్నాకు దిగారు.

కొద్దిసేపటి తరువాత ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్ రాజన్ సింగ్‌కు పోలీసు రక్షణ మధ్య ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. తాను ట్రాన్స్‌జెండర్ ఓటరునని, దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థినని పోలింగ్‌ బూత్‌లోని ప్రభుత్వ అధికారికి తాను చెప్పినప్పటికీ, తనను నెట్టివేశారని రాజన్‌సింగ్‌ ఆరోపించారు.

అన్ని పోలింగ్‌ బూత్‌ల వద్ద రెండు లైన్లు మాత్రమే ఉన్నాయని, అవి మగవారికి, ఆడవారికి మాత్రమే ఉన్నాయని, ట్రాన్స్‌జెండర్ల కోసం ఎలాంటి క్యూ ఏర్పాటు చేయలేదని రాజన్‌ సింగ్‌ ఆరోపించారు. అలాగే ట్రాన్స్‌ జండర్లుకు పోలింగ్‌ బూత్‌ల దగ్గర ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయలేదని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా, తాము ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నామని రాజన్‌ వాపోయారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)