Breaking News

పవన్‌.. అప్పుడు ఊగిపోయావు.. ఇప్పుడేమైంది?: జగ్గారెడ్డి

Published on Sat, 12/27/2025 - 12:38

సాక్షి, విజయవాడ: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమం ఒక చరిత్ర. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మోదీ కన్నుపడింది. అందుకే ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్‌ కల్యాణ్‌ స్టీల్‌ప్లాంట్‌పై ఊగిపోతూ మాట్లాడారు.. ఇప్పుడు ఎందుకు సైలెంట్‌ అయ్యారు?.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కుకి ఎంతో చరిత్ర ఉంది. 1966లో స్టీల్ ప్లాంట్ కోసం అమృతరావు నిరాహారదీక్ష చేశారు. పార్లమెంట్‌లో విశాఖ స్టీల్‌పై ఇందిరాగాంధీ ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రరాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా మారింది. విశాఖ ఉక్కు ఉద్యమం ఒక చరిత్ర. ఆంధ్రుల ఆస్తి స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుకు కట్టబెట్టాలనే కుట్ర మొదలైంది.  

రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్‌కు నాయకులు లేకుండా పోయారు.. కార్యకర్తలు మిగిలారు. ఏపీ ప్రజలు ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం ఊగిపోతూ మాట్లాడారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి తీసుకుని మాట్లాడకుండా కూర్చున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్లు చంద్రబాబు సీఎం అయ్యాడు. ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నారు. కుల పిచ్చిలో ఏపీ ప్రజలు నాయకులను ఎన్నుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ ప్రభుత్వానికి లేదు’ అని ఘాటు విమర్శలు చేశారు. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)