Breaking News

పరువునష్టం దావా ఉపసంహరించుకోండి 

Published on Sun, 04/09/2023 - 02:05

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌ తనకిచ్చిన లీగల్‌ నోటీసులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. ఈ ఉదంతంపై నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించకుండా తనను అడ్డుకోవడంలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన లీగల్‌ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. లేదంటే సివిల్, క్రిమినల్‌ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన నోటీసులకు తన న్యాయవాది కుమార్‌ వైభవ్‌ ద్వారా కేటీఆర్‌ న్యాయవాది ఇనుగంటి సుధాన్షురావుకు శనివారం సమాధానం పంపారు. 

కేటీఆర్‌వి నిరాధార ఆరోపణలు.. 
‘ఏదైనా ప్రజాసంబంధిత అంశంలో ప్రభుత్వ పారదర్శకతను ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్ష నాయకుడిపై ఉంటుంది. టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో నేను చేసింది కూడా అదే. కానీ ప్రతిపక్ష నేతగా ప్రజల వాణిని వినిపించే నా గొంతును నియంత్రించేందుకు కేటీఆర్‌ నాకు నోటీసులిచ్చారు. దర్యాప్తు సంస్థలనే కాకుండా ప్రజలను కూడా ప్రభావితం చేసేలా మాట్లాడారు.

లీకేజీలో  ఇద్దరు ఉద్యోగుల తప్పిదమే ఉందంటూ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని నేను ప్రజలకు చెబుతూ కేటీఆర్‌ వైఖరిని ప్రశ్నించాను. మంత్రిగా కేటీఆర్‌ నాపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి, రాజకీయ దురుద్దేశాలతో కూడినవి. అందువల్ల కేటీఆర్‌ వెంటనే నోటీసులను ఉపసంహరించుకోవాలి. లేదంటే తదుపరి పర్యవసానాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది’అని రేవంత్‌ తన సమాధానంలో పేర్కొన్నారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)