Breaking News

‘తెలంగాణకు ఏం ఎలగబెట్టారని ఒక్క చాన్స్’

Published on Mon, 04/07/2025 - 16:30

హైదరాబాద్: కేంద్ర మంత్రులు, తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ మరోసారి మండిపడ్డారు. అసలు తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ఒక్క చాన్స్ అడుగుతున్నారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏమి తెచ్చారో కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

‘11 ఏండ్లు తెలంగాణ కు ఏమి తెచ్చారో  వైట్ పేపర్ రిలీజ్ చేయండి.. చర్చకు సిద్ధమా.. మోదీ, అమిత్ షాలు ఆర్డర్ వేస్తేనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పని చేస్తారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూములు కరిగిపోతే ఎందుకు పట్టలేదు. 10 వేల ఎకరాల భూములను కేసీఆర్, కేటీఆర్ లు అమ్ముకుంటే కిషన్ రెడ్డి ఏం చేస్తుండు. 

ఇప్పడు కిషన్ రెడ్డి ఒక్క చాన్స్ కావాలని ప్రాధేయపడుతున్నాడు. తెలంగాణకు ఏమి ఎలగబెట్టారని ఒక్క చాన్స్ అడుగుతున్నారు. మూడుసార్లు మోదీని ప్రధానిని చేస్తే రాష్ట్రానికి ఏమీ ఎలగబెట్టారు. తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డికి ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తే ఏం చేశా. మీకు ప్రజలు చాన్స్ ఇవ్వరు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావడం కల. విభజన హామీలు  కిషన్ రెడ్డికి,బండి సంజయ్ కి పట్టదు. వారిద్దరూ పగటి కలలు కంటున్నారు’ అని విమర్శించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)