Breaking News

కేటీఆర్‌కు శిక్ష తప్పదు: టీపీసీసీ చీఫ్‌

Published on Thu, 11/14/2024 - 11:03

సాక్షి, హైదరాబాద్: అధికారులపై దాడి అనేది హేయమైన చర్య.. ఈ కేసులో కేటీఆర్‌కు శిక్ష తప్పదన్నారు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌. పక్కా ప్లాన్‌ ప్రకారమే కలెక్టర్‌పై దాడి జరిగింది. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.. దాడిలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్ట్‌ చేయాలని కోరారు.

టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో అధికారం పోయిందనే అక్కసు కేటీఆర్‌లో కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడమే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోంది. అధికారులపై దాడి హేయమైన చర్య.. కేటీఆర్‌కు శిక్ష తప్పదు. లగచర్లలో భూమిలేని వారు కలెక్టర్‌పై దాడి చేశారు. బీఆర్ఎస్ భారీ కుట్రలు చేస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారం దాడి జరిగింది.

అభివృద్ధి వికేంద్రీకరణను బీఆర్‌ఎస్‌ అడ్డుకుంటోంది. కేటీఆర్ ఫోన్ కాల్ సంభాషణలు ఉన్నాయని పోలీసులు నిర్దారించారు. లగచర్ల దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆర్. ఈ ఫార్ములా రేసులో డబ్బులు చేతులు మారాయి.. ప్రభుత్వ సొమ్మును కేటీఆర్ తన వారికి కట్టబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.. లగచర్ల దాడి ఘటనలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్టు చేయాలి. నిందితులను శిక్షించండి.

ప్రభుత్వ ఉత్సవాలలో పార్టీ కార్యకర్తలు పాల్గొనాలి. డిసెంబర్ 2 లేదా 3వ తేదీన హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. సంవత్సర కాలంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని సభ ద్వారా ప్రజలకు వివరిస్తాం. ఈనెల 16 నుంచి జిల్లాల పర్యటన చేస్తాను. మొదట కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తాను’ అని చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)