Breaking News

బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌ కౌంటర్‌

Published on Sat, 02/15/2025 - 21:13

సాక్షి, హైదరాబాద్‌: పుట్టుకతో బండి సంజయ్‌ ఓబీసీ, పుట్టుకతో మోదీ బీసీ కాదని.. ఓబీసీ ముసుగులో మోదీ బీసీలకు చేసిందేమీ లేదంటూ టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. కుల గణన దేశ చరిత్రలో నిలిచిపోయే అంశం. రేవంత్‌ మాటలకు బీజేపీ నేతలు హైరానా పడుతున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారంటూ మహేష్‌ గౌడ్‌ దుయ్యబట్టారు.

బీసీల మీద బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే జన గణనతో పాటు కుల గణన చేయాలి. కుల గణన రీ సర్వే పూర్తి అయ్యాక చట్టం చేస్తాం. 9వ షెడ్యూల్ చట్ట సవరణ చేసి దేశంలోని బీసీలకు కేంద్రంలో ఉన్న బీజేపీ మేలు చేయాలి. సీఎం రేవంత్.. మోదీ కులం గురించి తప్పుగా మాట్లాడలేదు.. అమిత్ షా కూడా దీనిని అంగీకరించారు. 24-7-1994న ఓసీ నుంచి ఓబీసీలలో చేర్చారు.

గాంధీ కుటుంబం త్యాగాలు మర్చిపోయి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు దేశం కోసం ఏం త్యాగం చేశారు?. రాహుల్ గాంధీ కులం దేశ ప్రజలకు తెలుసు. రాహుల్ గాంధీ కులం అడుగుతున్న మీరు దేశంలో కుల గణన చేసి ఆయన ఇంటికి వెళ్లి అడగండి. సోనియా గాంధీ ఇటలీలో పుట్టిన కానీ భారతీయతను పుణికి పుచ్చుకుంది. ఇప్పటికే డిల్లీ స్కాం బయట పడింది. పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా ఎన్ని స్కాంలు బయట పడతాయో తెలియదు. అందుకే పింక్ బుక్ ఓపెన్ చేయొద్దని కవితకు సూచనలు చేస్తున్నా’’ అంటూ మహేష్‌ గౌడ్‌ ఎద్దేవా చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)