HYD: నేడు కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల క్యాండిల్‌ ర్యాలీ..

Published on Sat, 06/01/2024 - 09:30

సాక్షి, హైదరాబాద్‌: రేపు(ఆదివారం) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. కాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రేపటికి దశాబ్ధం కాలం కానుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు గులాబీ శ్రేణులు రెడీ అయ్యాయి. ఇక, ఈరోజు(శనివారం) నుంచి మూడు రోజులపాటు వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని పార్టీ అధినేత కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు.

కాగా, రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలతో శనివారం హైదరాబాద్‌ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

 

మరవైపు.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు(ఆదివారం) తెలంగాణభవన్‌లో జరగబోయే పలు కార్యక్రమాల్లో మాజీ సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడం, పదేళ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు తదితర అంశాలపై ఆయన మాట్లాడనున్నట్టు సమాచారం. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)