Breaking News

అభయ ఘటన కేసు : సీఎం మమతా బెనర్జీకి భారీ షాక్‌

Published on Sun, 09/08/2024 - 14:21

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి భారీ షాక్‌ తగిలింది. కోల్‌కతా ఆర్‌జీకార్‌ ఆస్పత్రి అభయ ఘటనలో మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరుపై అధికార తృణముల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) రాజ్యసభ ఎంపీ జవహర్‌ సిర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆదివారం తన పార్లమెంటరీ పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మమతా బెనర్జీకి లేఖ రాశారు.  

ఆ లేఖలో.. తప్పు చేస్తున్నా సరే ప్రభుత్వంపై అభిమానం ఉందని కొంతమందిని, అవినీతిపరుల్ని పట్టించుకోవడం లేదని, వారిపై   చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. సీఎంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా, అందుకు సాధ్యపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
దీనికి తోడు అవితీని పాల్పడ్డ అధికారులకు(లేదా వైద్యులు) ప్రమోషన్లు ఇచ్చి వారికి మరింత ఉన్నత స్థానాల్ని కేటాయించడాన్ని తాను అంగీకరించబోమని’ అని సిర్కార్ చెప్పారు.

అంతేకాదు అభయ కేసులో బాధితురాలికి సత్వర న్యాయం జరుగుతుందని ఆశించా. దారుణం జరిగిన నాటి నుంచి న్యాయం చేస్తారనే ఎంతో ఒపికతో ఎదురు చూశా. అది జరగలేదు. పైగా ప్రభుత్వం నిందితుల్ని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం విఫలమైంది అని దీదీకి రాసిన లేఖలో సిర్కార్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దీదీ ఓ సలహా ఇచ్చారు. రాజకీయం కోసం నిరసనలు చేయకుండా.. బాధితురాలికి న్యాయం చేకూరేలా.. నిందితులకు శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఇటీవలి కాలంలో ఆర్‌జీకార్‌ అభయం ఘటనలో మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్‌జీకార్‌ ఆస్పత్రి ఘటనలో సొంత పార్టీ నేతలే మమతా తీరును విమర్శిస్తున్నారు. అలా విమర్శించినందుకే టీఎంసీ నేత శాంతాను సేన్‌ను పార్టీ పదవి నుంచి తొలగించింది. సుఖేందు శేఖర్ సైతం తిరుగు బావుటా ఎగురవేశారు. అభయ ఘటనలో దీదీ వైఫల్యాల్ని ఎత్తి చూపుతున్నారు. తాజాగా, రాజ్యసభ సభ్యుడు జవహార్‌ సిర్కార్‌ రాజీనామా చేయడం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)