Breaking News

కేటీఆర్‌, పొంగులేటికి మహేశ్వర్‌రెడ్డి సవాల్‌

Published on Mon, 09/23/2024 - 17:10

సాక్షి,హైదరాబాద్‌:బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలిపేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నాడని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు.కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌కు చీకటి ఒప్పందం లేకుంటే ఎందుకు బీఆర్‌ఎస్‌ నేతల మీద సీబీఐ,ఈడీ ఎంక్వైరీని  కాంగ్రెస్ కోరడం లేదని ‍ప్రశ్నించారు. మహేశ్వర్‌రెడ్డి సోమవారం(సెప్టెంబర్‌23) మీడియాతో మాట్లాడారు.

‘కేటీఆర్ ఇప్పుడు కళ్ళు తెరుచుకొని మేము బతికే ఉన్నామనే ప్రయత్నం చేస్తున్నారు.బీజేపీ ఎప్పుడో అమృత్ పథకం అవకతవలపై మాట్లాడింది.కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ.కేటీఆర్,హరీష్ ఢిల్లీ వెళ్లి కేసి వేణుగోపాల్‌తో కలిసి పని చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? 

పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఒప్పందం కుదిరి మీకు అనుకూలంగా ఉన్న మాట వాస్తవం కదా?అమృత్ టెండర్ల విషయంలో కేంద్రానికి నివేదిక ఇచ్చా.సుజన్‌రెడ్డి సీఎంకు బామ్మర్దో,బీఆర్‌ఎస్‌కు అల్లుడో అని రెండు పార్టీలు ఆరోపించికుంటున్నాయి.గ్లోబల్ టెండర్ల పేరుతో అమృత్ టెండర్లు కట్టబెట్టారు.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం అధికార దుర్వినియోగమే.మంత్రిగా కొనసాగడానికి పొంగులేటికి నైతిక అర్హత లేదు.మంత్రి పొంగులేటి,కేటీఆర్‌కు నేను సవాలు చేస్తున్నా.నేను చేసిన అరోపణలు వాస్తవమని తేల్చకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.లేదంటే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా?’అని మహేశ్వర్‌రెడ్డి ఛాలెంజ్‌ చేశారు.

కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న కాంగ్రెస్

ఇదీ చదవండి: ఎల్‌వోపీ సీటు కోసం కేటీఆర్‌,హరీశ్‌ ఫైట్‌ 

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)