Breaking News

‘రఘురామకు సాయిరెడ్డి తన ఇంటిని అద్దెకు ఎందుకిచ్చారు?

Published on Wed, 03/12/2025 - 17:25

సాక్షి, తాడేపల్లి: విజయసాయిరెడ్డి ఆరోపణలు సరికాదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేవీరావుకు, వైవీ సుబ్బారెడ్డి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. ఇద్దరి మధ్య సంబంధాలుంటే కేవీరావు కేసు ఎందుకు వేశారు?. ఎవరో ఇచ్చిన స్క్రిప్టును సాయిరెడ్డి చదివారు. వైఎస్సార్‌సీపీ ద్వారా ఎదిగిన వ్యక్తి సాయిరెడ్డి. నాయకుడు కష్టకాలంలో ఉంటే ఇలా పార్టీని వీడి వెళ్తారా?’’ అంటూ సుధాకర్‌ బాబు నిలదీశారు.

‘‘రాజ్యసభను వదిలేసి రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకున్నారు?. రఘు రామ కృష్ణంరాజుకు సాయిరెడ్డి తన ఇంటిని ఎందుకు అద్దెకు ఇచ్చారు?. అవతలి వ్యక్తులతో సాయిరెడ్డి ఎందుకు కలిశారు?. సాయిరెడ్డి పదేపదే కోటరీ అని మాట్లాడారు. ఆయనే స్వయంగా ఎంతోమందిని మా నాయకుడికి పరిచయం చేశారు. మరి ఆయన్ని మించిన కోటరీ ఇంకేం ఉంది?. సీఐడీ విచారణ అనేది ఒక బూటకం. విచారణ పేరుతో వచ్చి సాయిరెడ్డి డ్రామా చేశారు’’ అని సుధాకర్‌బాబు మండిపడ్డారు.

‘‘మా నేతలు, పార్టీపై అనవసర ఆరోపణలు చేశారు. సాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయటం ద్వారా ఎవరికి లాభం చేకూర్చినట్టు?. కేసులకు, వైఎస్సార్‌సీపీ నేతలకు లింకు పెట్టవద్దు’’ అంటూ సాయిరెడ్డికి సుధాకర్‌బాబు హితవు పలికారు.

YSRCP ద్వారా ఎదిగిన వ్యక్తి విజయసాయిరెడ్డి: టీజేఆర్

 

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)