Breaking News

ఖమ్మంలో పొలిటికల్‌ ట్విస్ట్‌.. తుమ్మల దారెటు?

Published on Thu, 08/24/2023 - 11:43

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ కంటే ముందుగానే పొలిటికల్‌ హీట్‌ మొదలైంది. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు.. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఎపిసోడ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు ఖమ్మం జిల్లాకు తుమ్మల రానున్నారు. మరోవైపు.. తుమ్మల అనుచరులు వెయ్యి కార్లతో ర్యాలీ తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తుమ్మలను ఒప్పించి పాలేరు నుంచి బరిలో నిలపాలని తీర్మానం చేశారు. ఇదిలా ఉండగా.. తుమ్మల కాంగ్రెస్‌లో చేరడానికే మొగ్గు చూపుతున్నారని ఆయన మెజార్టీ అనుచరులు చెబుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో తుమ్మల నిర్ణయం ఏవిధంగా ఉండబోతోంది అనేది చర్చనీయాంశంగా మారింది. 

మరోవైపు.. తుమ్మల అంశంలో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌ ఆదేశాలలో ఎంపీ నామా నాగేశ్వర రావు.. తుమ్మలతో భేటీ అ‍య్యారు. ఈ సందర్భంగా రాజకీయ భవిష్యత్తుపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తుమ్మలకు ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌లో తుమ్మలకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని నామా తెలిపినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

ఇది కూడా చదవండి: కేసీఆర్‌ మొండిచేయి.. అలకబూనిన మోత్కుపల్లి.. వాట్‌ నెక్స్ట్‌?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)