Breaking News

కూటమి సర్కార్‌ అక్రమ కేసులు.. ముగ్గురు సోషల్‌ మీడియా కార్యకర్తలకు బెయిల్‌

Published on Fri, 11/29/2024 - 18:16

సాక్షి, గుంటూరు: చిలకలూరిపేట నియోజకవర్గ సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి దంపతులకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో సుధారాణి దంపతులు పోస్ట్ పెట్టారంటూ నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.  నరసరావుపేట సబ్ జైల్లో ఉన్న సుధారాణి దంపతులను పిటి వారెంట్ ద్వారా గుంటూరు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టగా, సుధారాణి దంపతులకు బెయిల్ మంజూరైంది.

వైజాగ్ సోషల్ మీడియా యాక్టివిస్టు  బోడి వెంకటేశ్వర్లుకు కూడా గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఒంగోలు జైలు నుంచి పిటి వారెంట్ ద్వారా గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టగా, ఆయనుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కాగా, సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ పెద్దిరెడ్డి సుధారాణి పట్ల మహిళ అని కూడా చూడకుండా పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారని, రోజులతరబడి ఆమెపైన, ఆమె భర్తపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా, మానసికంగా వేధించారనే ఆరోపణలున్నాయి.

తెలంగాణలో గుడికి వెళ్లిన సుధారాణిని ఆమె భర్త, పిల్లలతో సహా పోలీసులు అదుపులోకి తీసుకొని చిలకలూరిపేటకు తీసుకొచ్చారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలి పెట్టాల్సింది పోయి వారి నిర్బంధంలోనే ఉంచుకొని, చిత్ర హింసలకు గురి చేశారు. ఆమెపై 6 అక్రమ కేసులు బనాయించారు. పోలీసులు శారీరకంగా వేధించి, గాయపర్చినట్లు ఆమె కోర్టుకు తెలిపారు. తనను, భర్త వెంకటరెడ్డిని, పిల్లలను చిలకలూరి­పేటకు తీసుకెళ్లారని, పిల్లలను వేరు చేసి భర్తతో పాటు తనను ఒంగోలు వన్‌టౌన్‌ పీఎస్‌కు తరలించినట్టు ఆమె కోర్టుకు చెప్పారు.

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)