Breaking News

కేంద్ర కేబినెట్‌: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు

Published on Sun, 06/09/2024 - 13:21

సాక్షి, విజయవాడ: కేంద్ర కేబినెట్‌లో ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలకు చోటు దక్కింది. ఒక సీనియర్, ఇద్దరు జూనియర్ ఎంపీలకు ఛాన్స్ లభించింది. ఒక బీసీ, ఇద్దరు ఓసీలకు కేబినెట్‌లో స్థానం లభించింది. కేంద్ర కేబినెట్‌లో కింజరాపు రామ్మోహన్‌నాయుడికి స్థానం దక్కగా.. మూడు సార్లు ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. బీసీ సామాజిక వర్గం నుంచి కేంద్ర కేబినెట్ పదవిని రామ్మోహన్‌ దక్కించుకున్నారు.

టీడీపీలో రెండో మంత్రి పదవిని పెమ్మసాని చంద్రశేఖర్ దక్కించుకున్నారు. దేశంలోని అత్యంత ధనవంతుడైన ఎంపీ అభ్యర్థిగా పేరొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌.. తొలిసారి ఎంపీగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందే టీడీపీలో చేరి, ఎంపీ సీటును  పెమ్మసాని దక్కించుకున్నారు. బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మను మంత్రి పదవి వరించింది. తొలిసారి ఎంపీగా శ్రీనివాస వర్మ ఎన్నికయ్యారు. పురందేశ్వరి, సీఎం రమేష్‌లకు తొలి కేబినెట్‌లో అవకాశం దక్కలేదు. క్షత్రియ, కమ్మ, కొప్పుల వెలమ సామాజికవర్గాలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.

శ్రీనివాస్ వర్మ ప్రొఫైల్‌..
క్షత్రియ వర్గానికి చెందిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ 1967 ఆగస్టు నాలుగున భూపతి రాజు సూర్యనారాయణరాజు దంపతులకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. ఈయన విద్యాపరంగా డబుల్ ఎంఏ చేయడంతో పాటుగా ఎం ఎల్ లిటరేచర్, బిఎల్ కూడా చేశారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రావీణ్యులు. 1991లో బీజేపీ పార్టీలో చేరిన శ్రీనివాస్ వర్మ 95 వరకు బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్‌గా, 95 నుండి 97 వరకు భీమవరం టౌన్ పార్టీ ప్రెసిడెంట్‌గా, 97 నుంచి 99 వరకు పార్టీ జిల్లా కార్యదర్శిగా.. 99 నుంచి 2001 వరకు నర్సాపురం పార్లమెంటు కన్వీనర్‌గా, 2001 నుండి 2003 వరకు బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్‌గా, 2003 నుంచి 2009 వరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, 2009లో  జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఎంపీగా పోటీ చేసి పరాజయం చెందారు. 

2010 నుంచి 2018 వరకు పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా, 2018 నుండి 2020 వరకు పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జిగా, 2020 నుండి 2023 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. భీమవరం మున్సిపాలిటీకి కౌన్సిలర్‌గా, ఫ్లోర్ లీడర్‌గా, ప్యానల్ చైర్మన్‌గా, డీఎన్ఆర్ విద్యాసంస్థలకు జాయింట్ సెక్రటరీగా, భూపతి రాజు బాపిరాజు ఎడ్యుకేషనల్ సొసైటీకి చైర్మన్‌గా, భీమవరం బిల్డర్స్ అసోసియేషన్‌కు గౌరవ ప్రెసిడెంట్‌గా కూడా శ్రీనివాస్ వర్మ సేవలందించారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)