Breaking News

సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్న చోట త్రీ మెన్ కమిటీ.. టీడీపీలో కలకలం!

Published on Sat, 05/20/2023 - 21:08

ఆ నియోజకవర్గంలో ఊసరవెల్లి భయపడే స్థాయి నేత ఒకరు గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారనే భయం ఆయన్ను వెంటాడుతోంది. ఆ భయంతోనే పక్క చూపులు చూస్తున్నారు. అక్కడ పోటీ చేయడానికి పచ్చ పార్టీలో ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో అభ్యర్థిని ఎంపిక చేయడానికి కమిటీ వేయబోతున్నారట టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ నేత ఎవరో చూద్దాం.

విశాఖ నగరం నార్త్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. తమ పార్టీ ఓడిపోవడంతో..ఎమ్మెల్యేగా గెలిచినా గంటా గత నాలుగేళ్ళుగా ఇంటికే పరిమితమయ్యారు. తనను అసెంబ్లీకి ఎన్నుకున్న ప్రజలను పట్టించుకోవడం మానేశారు. అయితే తొలి నుంచీ ఊసరవెల్లి రాజకీయాలు చేసే గంటా శ్రీనివాసరావుకు ఏ పార్టీ అయినా సరే అధికార పార్టీలోనే ఉండటం అలవాటు. కాని ప్రస్తుతం గతిలేక ప్రతిపక్షంలోనే కొనసాగుతున్నారు. ప్రజలకు దూరం కావడంతో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కేకే రాజునే కలుస్తున్నారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అందజేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి సక్రమంగా చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం నార్త్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ రోజురోజుకు బలపడుతోంది. జీవీఎంసీ ఎన్నికల్లో కూడా నార్త్ నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో విశాఖ నార్త్ నియోజకవర్గం అంటేనే టీడీపీ నేతలు వణికి పోతున్నారు. టీడీపీ నేతలు అంతర్గతంగా చేయించుకున్న సర్వేల్లో సైతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నార్త్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నారని వెల్లడయ్యింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 3,500 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. రోజు రోజుకీ వైఎస్ఆర్సీపీ బలపడుతుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా గంట మరో నియోజకవర్గాన్ని వెతుక్కునే పనిలో నిమగ్నమయ్యారు.

గంటా శ్రీనివాసరావు నియోజకవర్గం మారితే అక్కడ టీడీపీ పరిస్థితి ఏంటనే చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలి అనే అంశం మీద టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. పార్టీలో ఎవరిని పోటీ చేయమన్నా విశాఖ నార్త్ అంటే భయపడి ముందుకు రావడంలేదు. దీంతో పక్క పార్టీల్లో పోటీచేయగలవారు ఎవరైనా ఉన్నారా అని టీడీపీ నేతలు వెతుకుతున్నారు. తనను గెలిపించిన నియోజకవర్గాన్ని గంటా పట్టించుకోకపోవడంతో నార్త్ నియోజకవర్గానికి సంబంధించి త్రీ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఆ కమిటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఎక్కడైనా ఎమ్మెల్యే లేని చోట, నియోజకవర్గ ఇన్‌చార్జిలేని చోట, త్రీ మెన్ కమిటీ అనేది ఏర్పాటు చేస్తుంటారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సెగ్మెంట్‌లో త్రీ మెన్ కమిటీ ఏర్పాటు చేస్తుండటం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతుంది.

మరోవైపు నార్త్ నియోజకవర్గం నుంచి గతంలో బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహించిన విష్ణుకుమార్ రాజు పరిస్థితి కూడా అలాగే ఉంది. విష్ణుకుమార్ రాజు నార్త్లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బిజెపిలో ఉంటే వైయస్సార్సీపీకి కనీసం పోటీ కూడా ఇవ్వలేమని గ్రహించిన విష్ణు కుమార్ రాజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దయతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే విశాఖ నార్త్‌లో పోటీ అంటేనే ప్రతిపక్షాలు భయపడే పరిస్థితి ఏర్పడిందనే టాక్ నడుస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)