Breaking News

ఖాకీ చొక్కా టీడీపీకి తాకట్టు.. జగన్‌ను విమర్శించే స్థాయా నీది?

Published on Wed, 04/09/2025 - 10:24

అనంతపురం, సాక్షి: రామగిరి ఎస్సై సుధాకర్‌ యాదవ్‌ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని.. ఆయనే సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కురుబ లింగమయ్య హత్య జరిగి ఉండేదా? అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి(Thopudurthi Prakash Reddy). మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి ఎస్సై సుధాకర్‌ చేసిన కామెంట్లకు ప్రకాశ్‌రెడ్డి బుధవారం స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. 

‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసమే రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్(SI Sudhakar Yadav) ఇప్పుడు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు. జగన్‌ను విమర్శించే స్థాయి కూడా ఎస్సై సుధాకర్ యాదవ్‌కు లేదు. వ్యక్తిగత స్వార్థం కోసమే ఆయన పని చేస్తున్నారు. తన ఖాకీ చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారాయన. 

..సుధాకర్‌ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. రామగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు ఎస్సై సుధాకరే కారణం.  సుధాకర్ యాదవ్ ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. గతంలో దళితులను ఆయన కించపరచడం నిజం కాదా?. పరిటాల సునీతకు అనుగుణంగానే పని చేయడం వాస్తవం కాదా?. అసలు ఎస్సై సుధాకర్‌ సరిగగ్గా పని చేసుంటే లింగమయ్య హత్య జరిగి ఉండేదా?. నీ ధర్మ సందేశలు ఎక్కడికి పోయాయి? ఎవరిని నమ్ముకుని ఇలా చేస్తున్నావు?.టీడీపీ నేతలకు చుట్టంగా పనిచేసేందుకా నీకు ఖాకీ చొక్కా ఇచ్చింది?.. అంటూ సుధాకర్‌ను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిలదీశారు.

.. ఎస్సై సుధాకర్ యాదవ్ అక్రమాస్తులు అనేకం ఉన్నాయి. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. ఎమ్మెల్యే పరిటాల సునీత ద్వారా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పొందాలని భావిస్తున్నాడు. కానీ, పరిటాల సునీత(Paritala Sunitha) ఇంకొకరికి టిక్కెట్ ఇప్పించే స్థాయిలో లేరన్న విషయం సుధాకర్‌ గ్రహించాలి. చంద్రబాబును ఎమ్మెల్యే పరిటాల సునీత దూషించారు. అందుకే ఆ కుటుంబానికి చంద్రబాబు వద్ద ప్రాధాన్యత లేకుండా పోయింది. 

పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు కనిపించవా?. పోలీసుల పై చంద్రబాబు దూషణలు వినిపించవా?. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఎందుకు?. చంద్రబాబు మెప్పు కోసం పనిచేసే పోలీసులను బట్టలూడదీస్తొనన్న వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది?. కురుబ లింగమయ్య ను పరిటాల సునీత సమీప బంధువులు చంపితే... వారి అనుచరులనే కేసులో సాక్షులుగా పెట్టడం కరెక్టా?అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు