Breaking News

చంద్రబాబు రాయలసీమ బిడ్డ కాదు.. సీమ ద్రోహి: తోపుదుర్తి

Published on Fri, 05/30/2025 - 12:37

సాక్షి, అనంతపురం: ఏపీలో చంద్రబాబు పాలన అగమ్యగోచరంగా సాగుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి. ఎన్నికల హామీలు అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్‌ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేయని పనులను చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం అంటూ మండిపడ్డారు. మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎన్టీఆర్ ఏఐ వీడియో హాస్యాస్పదమని అన్నారు.

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు. చంద్రబాబుకు మతిమరుపు వచ్చిందన్న అనుమానం ఉంది. చేయని పనులను చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఇది హాస్యాస్పదం. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు నిలిపేశారు. చంద్రబాబుది రౌడీ రాజ్యం, గూండా రాజ్యం.  

మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్‌నే గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని చంద్రబాబు.. బనకచర్ల డ్యాం అంటూ ఊదరగొడుతున్నారు. కరవు, అబద్ధాలు, వెన్నుపోటుకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్. సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్ళు కాదు.. టీడీపీ నేతలు అవినీతి నిధులు పారిస్తున్నారు. చంద్రబాబు రాయలసీమ బిడ్డ కాదు.. సీమ ద్రోహి. ప్రజలను వంచించే వాళ్ళు సీమ బిడ్డలు కాలేరు.  నిజమైన రాయలసీమ బిడ్డలు వైఎస్సార్, వైఎస్ జగన్’ అని చెప్పుకొచ్చారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)