Breaking News

‘అమరావతి కేరాఫ్‌ అవినీతి’

Published on Wed, 03/19/2025 - 16:35

సాక్షి,తాడేపల్లి : సీఎం చంద్రబాబుకు అమరావతిపై ఉండే ప్రేమ మిగతా ప్రాంతాలపై ఎందుకు ఉండడం లేదని మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్‌ రెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అమరావతి నిర్మాణ పనుల‍్లో భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తోపుతుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  

చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తుంగలో తొక్కారు. పోలవరం ఎత్తును తగ్గిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. దీని వలన 40టీఎంసీల నీరు రాయలసీమకు రాకుండా పోయింది. పోలవరాన్ని చివరికి బ్యారేజీగా మార్చేశారు. దీనివల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ద్వారా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు.

పనులు ప్రారంభిస్తే వాటిని కూడా చంద్రబాబు ఆపేయించారు. 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇప్పుడు నీరులేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై రాయలసీమలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. శ్రీశైలంలో హక్కుగా రావాల్సిన నీటిని వాడుకోవటానికి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు వైఎస్‌ జగన్ తెచ్చారు. ఆ పనులన్నిటినీ చంద్రబాబు తన పార్టీ వారితో కేసులు వేయించి ఆపారు.

రాయలసీమ మీద చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపించటం సరికాదు. శిష్యుడైన రేవంత్‌రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కయ్యారు. అందుకే రాయలసీమకు రావాల్సిన నీటిని కూడా తెలంగాణాకు వెళ్లేలా చేస్తున్నారు. రాయలసీమ రైతులు ప్రభుత్వంపై ఉద్యమం చేయటానికి రెడీ అవుతున్నారు. అమరావతిపై ఉండే ప్రేమ మిగతా ప్రాంతాలపై ఎందుకు లేదు?. అమరావతిలో జరిగే కాంట్రాక్టుల్లోనూ భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. వైఎస్‌ జగన్ తెచ్చిన పారదర్శకత లేకుండా అడ్డుగోలుగా కాంట్రాక్టులను కట్టబెట్టేస్తున్నారు’అని ఆరోపించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)