Breaking News

విగ్రహంపైనా టీడీపీ విష రాజకీయం 

Published on Mon, 02/12/2024 - 05:24

సాక్షి ప్రతినిధి, కడప:  కాదేదీ దుష్ప్రచారానికి అన­ర్హం అన్నట్లుగా  తెలుగుదేశం పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రతిష్ట దెబ్బతీసేలా వారి వైఖరి ఉంది. వాస్తవాలతో నిమిత్తం లేకుండా దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌ జిల్లా పులివెందుల కేంద్రంగా బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని సైతం రాజకీయ లబ్దికోసం వాడుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది.  

పులివెందుల మోడల్‌ టౌన్‌లో భాగంగా వివిధ సర్కిల్స్‌లో జాతీయ నేతల విగ్రహాల ఏర్పాటుకు పాడా (పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ) శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జాతిపిత మహాత్మాగాం«దీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను తెలంగాణ నుంచి తీసుకువచ్చారు. ఇవి శుక్రవారం సాయంత్రానికి పులివెందుల చేరుకున్నాయి. పాత బస్టాండు సమీపంలో డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటుకు పిల్లర్‌ సిద్ధం చేశారు. అక్కడే విగ్రహాలు క్రేన్‌ సహాయంతో లారీ నుంచి దించారు.

వైఎస్సార్‌ విగ్రహాన్ని పిల్లర్‌పైన పెట్టారు.  అలాగే జాతిపిత విగ్రహం ఆవిష్కరణకు  కోర్టు సర్కిల్‌ వద్ద ఏర్పాట్లు చేశారు. గరండల్‌ బ్రిడ్జి సమీపంలో సుందరీకరణతోపాటు అక్కడే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచారు.

ఇంకా పిల్లర్, సుందరీకరణ పూర్తికాకపోవడంతో కాంట్రాక్టర్‌ నిరంజన్‌రెడ్డి ఇంట్లో డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని భద్ర­పర్చారు. అంతలోనే  క్రేన్‌ నుంచి కిందికి దించిన విగ్రహాన్ని ఫొటో తీసి టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. సోషల్‌ మీడియాలో  అంబేడ్కర్‌ విగ్రహాన్ని వైఎస్సార్‌ విగ్రహం కింద ఉంచారంటూ దుష్ప్రచారం      చేస్తున్నారు.  

సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు 
మోడల్‌ టౌన్‌లో భాగంగా సుందరీకరణ పనులు, జాతీయ నేతల విగ్రహాల ఏర్పాటుకు పాడా కృషి చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు పనులు కొనసాగుతున్నాయి. అంతలోనే రాజకీయ స్వలాభం కోసం సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ప్రతిష్టను దెబ్బతీసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నారు.

పిల్లర్‌ లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమేనా అని ప్రశి్నస్తున్నారు. క్రేన్‌ సహాయంతో వాహనం నుంచి దించి ఉన్న విగ్రహాన్ని ఫొటో తీసి ప్రచారం చేయడం ఎంతవరకు సబబని   నిలదీస్తున్నారు. అంబేడ్కర్‌ను కించపరిచే విధంగా అవాస్తవాలు ప్రచారం చేసిన టీడీపీ శ్రేణులు భారత జాతికి క్షమాపణ చెప్పాలని   డిమాండ్‌ చేస్తున్నారు.  

అత్యంత సుందరంగా అంబేడ్కర్‌ విగ్రహం 
పులివెందుల మోడల్‌ టౌన్‌లో భాగంగా సుందరంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పా­టు­చేసినట్లు  కౌన్సిలర్‌ పార్నపల్లె కిశోర్‌ పేర్కొన్నారు.  ఆయన ఆదివారం  పులివెందులలో మా­టా­్లడుతూ  స్థానిక గరండాల్‌ బ్రిడ్జి దగ్గర  విగ్ర­హ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్, వైస్‌ చైర్మన్, పార్టీ పట్టణ ఇన్‌చార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి స్థానిక ఎస్సీ, బీసీ నాయకులతో కలిసి స్థల పరిశీలించారని తెలిపారు. అందులో భాగంగా శిల్ప కళాకారుడితో ప్రత్యేకంగా కళాత్మకంగా రూపొందించిన అంబేడ్కర్‌ విగ్రహం కూడా పులివెందులకు చేరుకుందన్నారు.  టీడీపీ నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు.  

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)