Breaking News

సమన్వయం లేనిచోటే సమన్వయ సభ

Published on Sun, 02/25/2024 - 05:51

సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయంటే.. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ధర్మం ఒకటి ఉంటుంది. ఏ పనైనా కలిసికట్టుగా చేయాలన్న ఓ కట్టుబాటు ఉంటుంది. తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేనల మధ్య ఇదే కొరవడింది. సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాట్లు దీనికో తాజా ఉదాహరణ. ఈ నెల 28న టీడీపీ, జనసేన సంయుక్తంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. దీనిలో భాగంగా ఏర్పాట్ల పరిశీలనకు రెండు పార్టీల నాయకులతో కమిటీలు వేస్తామని ప్రకటించారు.

కానీ.. జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నేతలు 100 మందితో సభ జరిగే ప్రత్తిపాడు ప్రాంగణాన్ని శుక్రవారం ఉదయం పరిశీలించి వెళ్లిపోయారు. అంతకు ముందు గురువారం సాయంత్రమే టీడీపీ నాయకులు కూడా సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. పరిశీలన సమయంలో వీరు వారిని, వారు వీరిని పిలవలేదు. నాదెండ్ల మనోహర్‌ శుక్రవారం ఉదయం పరిశీలించారని తెలియగానే ఆ సాయంత్రమే టీడీపీ జోన్‌–2 కోఆర్డినేటర్‌ నేతృత్వంలో తాడేపల్లిగూడెంలో హడావుడిగా సమావేశం పెట్టారు.

మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, టీడీపీ ఇన్‌చార్జి వలవల బాబ్జి, కొందరు మాజీ ఎమ్మెల్యేలు హడావుడిగా ఏర్పాట్లు పరిశీలించి అంతా టీడీపీయే చేస్తోందని, జనసేనది ఏమీ లేదన్నట్టు వ్యవహరించారు. మరోవైపు సభా ప్రాంగణాన్ని తానే మాట్లాడి సెట్‌ చేశానని, అంతా తామే చేస్తున్నామని జనసేన ఇన్‌చార్జి మౌత్‌ పబ్లిసిటీ ప్రారంభించారు. ఇలా ఎవరికి వారుగా పనిచేస్తుండటం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.   

కొనసాగుతున్న మాటల యుద్ధం 
తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా వలవల బాబ్జి, జనసేన ఇన్‌చార్జిగా బొలిశెట్టి శ్రీనివాస్‌ టికెట్‌ ఆశిస్తూ బరిలో ఉన్నారు. ఇద్దరూ టికెట్‌ మాదంటే మాదంటూ వారి స్థాయికి మించి భారీగా ప్రకటనలు చేసుకుంటున్నారు. జనసేన మొదట ప్రకటించే సీటు తాడేపల్లిగూడెమేనని బొలిశెట్టి శ్రీనివాస్, 20 ఏళ్ల తరువాత టీడీపీ గెలిచే సీటు తాడేపల్లిగూడేమని వలవల బాబ్జీ ప్రకటించడంతో మాటల యుద్ధం ప్రారంభమైంది.

ఒకరి సమావేశాలకు మరొకరు వెళ్లకుండా అదే రోజు కౌంటర్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహించే స్థాయికి ఇది చేరింది. పార్టీలు రెండు దారుల్లో వెళ్తున్న ప్రాంతంలో సభ నిర్వహించనుండటంతో కొత్త చిచ్చు మొదలైందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇక టీడీపీ, జనసేన తొలి జాబితాలో మొదటి సీటు తాడేపల్లిగూడెం ఉంటుందని నానా హడావుడి చేశారు. తొలి జాబితాను శనివారం ప్రకటించినప్పటికీ, బహిరంగ సభ నేపథ్యంలో వివాదం జరగకుండా టికెట్‌ను పెండింగ్‌లో ఉంచారని తెలుస్తోంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)