Breaking News

‘ఠాక్రే బ్రాండ్‌’ సత్తా చూపుదాం

Published on Thu, 08/07/2025 - 19:58

సాక్షి ముంబై: ఎమ్మెన్నెస్, శివసేన(యూబీటీ) పొత్తుపై గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు దాదాపుగా తెరపడింది. శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే (Raj Thackeray) ఒక్కటి కావడం ఖాయమన్న సంకేతాలిచ్చారు. ముంబైలో జరగబోయే బెస్ట్‌ క్రెడిట్‌ యూనియన్‌ ఎన్నికల్లో రెండు పార్టీలూ కలిసిపోటీచేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక ప్రభావం చూపనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు దీపావళి తర్వాత నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ ప్రకటన తర్వాత ఠాక్రే సోదరులిద్దరూ (Thackeray Cousins) బెస్ట్‌ క్రెడిట్‌ యూనియన్‌ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుని రాష్ట్ర రాజకీయాల్లో మార్పు ఖాయమని అందరికీ తెలిసేలా చేశారని చెప్పవచ్చు. బెస్ట్‌ క్రెడిట్‌ యూనియన్‌ ఎన్నికలు ఆగస్టు 18న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో శివసేన (యూబీటీ), ఎమ్మెన్నెస్‌లకు చెందిన కార్మిక యూనియన్లు కలిసి పోటీ చేయనున్నాయి. దీంతో ఈసారి ఎన్నికల దిశ మారనుంది. ముఖ్యంగా బెస్ట్‌ క్రెడిట్‌ యూనియన్‌ ఎన్నికలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు రెఫరెండంగా నిలుస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.  

ఉత్కర్ష ప్యానెల్‌ పేరుతో ఎన్నికల బరిలో... 
ది బెస్ట్‌ ఎంప్లాయీస్‌ కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ఎన్నికల్లో ఠాక్రే బంధువులు రెండు పార్టీలు ఉత్కర్ష ప్యానెల్‌తో పోటీ చేయనున్నాయి. ఈ మేరకు రెండు వర్గాలు ‘ఠాక్రే బ్రాండ్‌’ అని రాసున్న ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశాయి. ఈ పోస్టర్‌లో ఉద్దవ్‌ఠాక్రే, రాజ్‌ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, అమిత్‌ ఠాక్రేలతోపాటు శివసేన (యూబీటీ), ఎమ్మెన్నెస్‌ నాయకుల ఫొటోలున్నాయి.

చ‌ద‌వండి: ‘కబూతర్‌ ఖానా’మూసివేతపై క‌న్నెర్ర‌  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)