Breaking News

ఖాకీల అరాచకం.. పిన్నెల్లి గ్రామ శివారులో హైటెన్షన్‌

Published on Fri, 01/16/2026 - 13:31

సాక్షి, పల్నాడు జిల్లా: పిన్నెల్లి గ్రామ శివారులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాసు మహేష్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు కాసు మహేష్‌ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సాల్మన్‌ అంత్యక్రియలకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు కాసు మహేష్‌రెడ్డి సహా పార్టీ నేతలను అడ్డగించారు. బారీకేడ్లతో వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

అంత్యక్రియలకు వెళ్తే పోలీసులకు వచ్చిన నష్టమేంటి? అంటూ పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బెఠాయించారు. అంత్యక్రియలు కూడా చేసుకోనివ్వరా అంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి చూపు కూడా చూసుకోనివ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కాసు మహేష్‌రెడ్డికి వైఎస్‌ జగన్‌ ఫోన్‌
సాల్మన్‌ అంత్యక్రియలను అడ్డుకోవద్దంటూ వైఎస్‌ జగన్‌ పోలీసులను హెచ్చరించారు. పిన్నెల్లి గ్రామంలోకి వైఎస్సార్‌సీపీ నేతలను అనుమతించాలన్నారు. ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘గురజాల నియోజకవర్గంలో 7 రాజకీయ హత్యలు జరిగాయి. పిన్నెల్లిలో 300 కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయాయి. సాల్మన్‌పై దాడి చేసి చంపేశారు. తిరిగి బాధితుడిపైనే పోలీసులు కేసు పెట్టారు. ఈ ఘటనపై హైకోర్టుకు వెళ్తాం. మా ప్రభుత్వం వచ్చాక విచారణ చేయిస్తాం. బాధితుల కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’’ అని కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు.

పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మన్‌ మొదటి నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊరు వదిలి వెళ్లిపోవాలని సాల్మన్‌కు తెలుగుదేశం నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రాణభయంతో కుటుంబంతో సహా బ్రహ్మణపల్లికి మకాం మార్చాడు. అయితే.. వైఎస్సార్‌సీపీ నేతలు ధైర్యం చెబుతుండడంతో రెండు నెలల కిందట సాల్మన్‌ కుటుంబం తిరిగి పిన్నెల్లికి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు స్థానికుల సాయంతో టీడీపీ నేతలు వాళ్లను అడ్డుకున్నారు. పంచాయితీ తర్వాత చివరకు సాల్మన్‌ మినహా కుటుంబ సభ్యులను మాత్రమే ఊర్లో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అయితే..  

సాల్మన్‌ భార్య ఈ మధ్య అస్వస్థతకు గురైంది. దీంతో.. ఈనెల 10వ తేదీన పిన్నెల్లి వెళ్లి ఆమెను చూడటానికి సాల్మన్ ప్రయత్నించాడు. రావొద్దన్నా.. ఎందుకు వచ్చావ్‌ అంటూ టీడీపీ గూండాలు ఆయన్ని చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టైంలోనే కోమాలోకి వెళ్లిన సాల్మన్‌.. చివరకు నాలుగు రోజుల తర్వాత ఈ ఉదయం కన్నుమూశారు.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)