Breaking News

మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత.. లోకేష్‌కు చెప్పినా లాభం లేదని..

Published on Mon, 04/21/2025 - 20:01

గుంటూరు,సాక్షి: మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దెందులూరులో మట్టి మాఫియా వేధింపులు భరించలేక మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట దాసరి బాబురావు అనే వ్యక్తి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డారు. మట్టి మాఫియా వేధింపులతో మనస్తాపం చెంది బ్లేడుతో చేయి కోసుకున్నారు. అప్రమత్తమైన టీడీపీ పార్టీ సిబ్బంది బాబురావును అత్యవసర చికిత్స నిమిత్తం మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. తమ భూముల్ని కబ్జా ప్రయత్నం జరుగుతోందని, మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బాధితురాలి భార్య మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. 

దాసరి బాబురావు ఆత్మహత్యయత్నంపై ఆమె భార్య దాసరి దాసరి నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ‘మాకు దెందులూరి మండలం చల్ల చింతల పూడిలో పొలం ఉంది. మా పొలంలో జేసీబీలతో మట్టి తవ్వి ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మేం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మనుషులం అని బెదిరిస్తున్నారు. ఇదే విషయం గురించి చింతమనేనితో మా బంధువులు మాట్లాడితే మట్టి మాఫియాతో సెటిల్ చేసుకోమని చెప్తున్నారు. మేం మట్టి మాఫియాని అడ్డుకోడానికి ప్రయత్నించాం. సాధ్యం కాలేదు. మట్టి మాఫియా గురించి అధికారులు అందరికీ ఫిర్యాదు చేశాం ఎవరూ పట్టించుకోవట్లేదు. బెదిరింపులకు పాల్పడుతున్నారు.  పైగా మధ్యవర్తులు కలగజేసుకుని రూ.90లక్షలు తీసుకుని, రూ.2కోట్లు తీసుకురమ్మని మని అంటున్నారు. లేదా మీ పొలం మాకు అమ్ముతున్నట్లు సంతకాలు చేయమని బెదిరిస్తున్నారు. 

ఆ బెదిరింపులు,ప్రాణభయంతో ఇల్లు వదిలి పారిపోయి వచ్చాం. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాం. కనీసం మా ఫిర్యాదు కూడా తీసుకోలేదు. చివరికి ఎస్పీ కార్యాలయానికి కూడా మమల్ని రానివ్వట్లేదు. పోలీసులు మమ్మల్ని మట్టి మాఫియాతో సెటిల్ చేసుకోమని సలహా ఇస్తున్నారు. మంత్రి లోకేష్‌ను కలిసి మా బాధ చెప్పుకున్నాం. మట్టి మాఫియా చివరకు లోకేష్ మాటను కూడా లెక్క చేయలేదు.

ఇంకా ఎక్కడికి వెళ్లినా ఉపయోగం లేదని ఉదయం టీడీపీ కార్యాలయానికి వచ్చాం. మట్టి మాఫియా వేధింపులతో మనస్థాపం చెందిన నా భర్త చేయి కోసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు’ అని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)