Breaking News

ఫైనల్‌ స్టేజ్‌కు కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్‌.. ఐదు స్థానాలపై టెన్షన్‌!

Published on Thu, 10/26/2023 - 19:54

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్లాన్‌ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక, ఇప్పటికే మొదటి జాబితాలను విడుదల చేసిన హస్తం పార్టీ.. రెండో జాబితాపై తర్జనభర్జన పడుతోంది. అయితే, అభ్యర్థుల జాబితా కసరత్తు తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. 

వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ రెండో జాబితా ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశముంది. ఇందులో భాగంగానే రేపు(శుక్రవారం) ఉదయం 9.30కు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అన్ని స్థానాలకు అభ్యర్థులను ఫైనల్‌ చేయనుంది. ఇక, తెలంగాణ కాంగ్రెస్‌లో ఐదు సీట్లలో హోరాహోరి పోటీ నెలకొంది. సంక్లిష్ట స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. కాగా, అభ్యర్థుల ఎంపిక ఒక నియోజకవర్గంతో మరో నియోజకవర్గం ముడిపడి ఉంది. 

హోరాహోరీ స్థానాలు ఇవే..
1. బోథ్: డాక్టర్ నరేష్ జాదవ్ / రాథోడ్ బాపురావు

2. తుంగతుర్తి: అద్దంకి దయాకర్ / డాక్టర్ వడ్డేపల్లి రవి   

3. మహేశ్వరం: కిచ్చేన గారి లక్ష్మారెడ్డి / పారిజాతా రెడ్డి

4. జడ్చర్ల: ఎర్ర శేఖర్ / అనిరుధ్‌ రెడ్డి 

5. మక్తల్: శ్రీహరి / ప్రశాంత్ రెడ్డి.

అయితే, మక్తల్ సీటు బీసీకి  ఇస్తే జడ్చర్ల సీటు రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, మక్తల్ నుంచి సీటు ఆశిస్తున్న శ్రీహరి ముదిరాజ్, జడ్చర్ల నుంచి  ఎర్ర శేఖర్ ముదిరాజ్ టికెట్ ఆశిస్తున్నారు. తాండూరు టికెట్ మనోహర్ రెడ్డికి, మహేశ్వరం టికెట్ కేఎల్ఆర్‌కి వచ్చే అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)