Breaking News

కన్నుమూస్తే.. టీడీపీ కౌంట్‌లోకి

Published on Thu, 09/14/2023 - 03:35

సాక్షి, నంద్యాల/తాళ్లపూడి/కొవ్వూరు/వెంకటగిరి రూరల్‌: తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలను వీడ­డం లేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్‌ డెవ­లప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి, జైలుకు వెళ్లిన నేప­థ్యంలో ప్రజల్లో సానుభూతి కోసం వెంపర్లాడు­తు­­న్నారు.

అనారోగ్యం, ఇతర కారణాలతో రాష్ట్రంలోని చనిపోయిన వారిని చంద్రబాబు అరెస్టును తట్టుకోలేకే చనిపోతు­న్నారంటూ టీడీపీ తమ ఖాతా­లో వేసుకుంటోంది. ఈ మరణాలను పచ్చపత్రికల్లో ప్రచు­రిస్తూ బాబు అరెస్టును తట్టుకోలేక చనిపోయా­రంటూ కలరింగ్‌ ఇస్తున్నారు. ఇది చూసి మృతుల కుటుంబసభ్యులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మరణా­లకు, చంద్రబాబు అరెస్టుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు.

టీడీపీ ఖాతాలో వేసుకున్న మరణాలు.. వాటి వెనుక నిజాలు..
నంద్యాల జిల్లా పాణ్యం మండలం, గోరు­మానుకొండ గ్రామానికి చెందిన తెలుగు వెంకటేశ్వర్లు కుటుంబ సమస్యలతో చాలాకాలం క్రితం మద్యానికి బానిస­య్యాడు. గత నెల రోజులుగా మరింత ఎక్కువగా మద్యం సేవిస్తున్నాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం ఎక్కువగా తాగి.. ఆ మత్తులో పురుగుల మందు తాగాడు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లి అదేరోజు మర­ణించాడు. ఈ మరణాన్ని టీడీపీ నాయకులు తమ ఖాతాలో వేసుకున్నారు. 

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని లింగాల గ్రామా­నికి చెందిన నెత్తికప్పుల నాగరాజు కుటుంబమంతా గతకొన్నేళ్లుగా వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలుపుతున్నారు. మంగళవారం నాగరాజు గుండెనొప్పితో మరణించారు. ఇతని కుటుంబ సభ్యులను బతిమలాడి, పార్టీ నుంచి ఆర్థికసాయం అందుతుందని మభ్యపెట్టి చంద్రబాబు రిమాండ్‌ను తట్టుకోలేక గుండెపోటుతో మరణించినట్లు టీడీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన టీడీపీ నాయకుడు చెరుకూరి సూర్యనారాయణ (80) వృద్ధాప్య సంబంధిత బాధలతో మంగళవారం మృతి చెందారు. ఈ మరణాన్ని సానుభూతి ఖాతాలో టీడీపీ నేతలు వేసుకున్నారు. 

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త జొన్నకూటి శేఖర్‌ (45) కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. ఆదివారం అర్ధరాత్రి మూత్రవిసర్జనకు లేచి కుప్ప కూలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భార్య సోదరుడు టీడీపీ సానుభూతిపరుడు. అతని మాట ప్రకారం టీడీపీ వాళ్లు సాయం చేస్తారనే ఉద్దేశంతో వారి ఖాతాలో వేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు.  

తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం రాణిపేటకు చెందిన వీర కృష్ణయ్య (63) చేనేత కార్మికుడు. మంగళవారం సాయంత్రం తమ మిద్దెపైకి ఎక్కిన సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కృష్ణయ్య మనుమడు మహేశ్‌ ఆయనను చికిత్స నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించాడు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. కృష్ణయ్య మృతికి చంద్రబాబు గృహ నిర్బంధం పిటిషన్‌ తిరస్కరణకు సంబంధం లేదని ఆయన మనుమడు మహేష్‌ స్పష్టం చేశారు. 

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గండమాల వెంకటేశ్వర్లు అలియాస్‌ వెంకటి షుగరు, బీపీతో బాధపడుతున్నాడు. మద్యం ఎక్కువగా సేవిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోనే మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు వెంకటి మృతికి ఎలాంటి సంబంధం లేదని గ్రామస్తులు తెలిపారు.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)