Breaking News

ఆదివాసీల గుడిసెల తొలగింపు.. కేసీఆర్‌ పాలనకు ముగింపు 

Published on Sun, 07/10/2022 - 01:24

సాక్షి, హైదరాబాద్‌: ఆదివాసీల గుడిసెల తొలగింపుతో సీఎం కేసీఆర్‌ తన పాలనకు ముగింపు పలికారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. శనివారం ఆమె మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయ పోచగూడలో ఆదివాసీల గుడిసెల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పోడు పట్టాల కోసం పోరాడుతున్న ఆదివాసీ ఆడ బిడ్డలను వివస్త్రలను చేయడం నయా నిజాం నిరంకుశ పాలనకు పరాకాష్ట అని దుయ్యబట్టారు.

వాస్తవానికి తెలంగాణలో పోడు భూములకు పట్టాలిస్తామని కేసీఆర్‌ ఇచ్చిన హామీని గుర్తుచేశారు. కుర్చీ వేసుకుని మరీ పోడు భూముల లెక్క తేల్చుతా అని అన్న మాటలు గుర్తు లేవా? అని ప్రశ్నించారు. ఆడవాళ్లు అని కూడా పోలీసులకు కనికరం లేదని, ఒంటి మీది బట్టలు ఊడిపోతున్నా చూడకుండా ఈడ్చి పడేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మొన్న చంటి బిడ్డల తల్లులను జైల్లో పెట్టించారు.

ఇయ్యాల ఆదివాసీలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు’ అని పార్టీ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర మళ్లీ వాయిదా పడింది. ఈనెల 10న పునఃప్రారంభం కావాల్సిన పాదయాత్రను ఈనెల 12కి వాయిదా వేశారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. షర్మిల తన పాదయాత్రను తిరిగి హుజూర్‌నగర్‌ నియోజకవర్గం గరిడేపల్లి మండలం కల్మలచెరువు నుంచి ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి తెలిపారు.    

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)