Breaking News

కేసీఆర్‌ సంతకం రైతులకు మరణశాసనం 

Published on Sun, 05/08/2022 - 01:20

మెదక్‌జోన్‌: యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పెట్టిన సంతకం నేడు రాష్ట్ర రైతాంగానికి మరణ శాసనంగా మారిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. శనివారం మెదక్‌ వచ్చిన సందర్భంగా మార్కెట్‌లోని ధాన్యాన్ని పరిశీలించిన ఆమె రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి బాధలు తెలుసుకున్నారు.

అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వరి వేస్తే ఉరే అని చెప్పిన సీఎం కేసీఆర్‌ మాటలు నమ్మిన రైతులు గతేడాదితో పోలిస్తే 17 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఖాతాలో రూ.850 కోట్లు నగదు ఉందని అందులో నుంచి రైతులకు పరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్‌ చేశారు. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే కేంద్రం అంతు చూస్తామంటూ ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఆర్, ఢిల్లీలో ధర్నా చేసి రాష్ట్రానికి వచ్చి మేమే కొంటామని చెప్పారని గుర్తు చేశారు.

ఆ మాట చెప్పి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభించలేదని విమర్శించారు. రైతు పండించిన ధాన్యం కొనలేనప్పుడు సీఎం ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకని ప్రశ్నించారు. వైఎస్సార్‌టీపీ అధికారంలోకి వచ్చాక రాజన్న రాజ్యం మళ్లీ తీసుకొస్తానని షర్మిల స్పష్టం చేశారు. ఆమె వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం తదితరులు ఉన్నారు.  

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)