Breaking News

అభివృద్ధిని విస్మరించిన సీఎం కేసీఆర్‌: షర్మిల 

Published on Sat, 07/02/2022 - 02:54

పెన్‌పహాడ్‌: సీఎం కేసీఆర్‌కు ఓటు వేస్తే అభివృద్ధి చేయడం మరిచి ధరలు పెంచారని, ప్రజలను ఆదుకోరు కానీ పన్నులు, ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు మాత్రం భారీగా వసూలు చేస్తున్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండల పరిధిలోని అనంతారం క్రాస్‌రోడ్, పెన్‌పహాడ్, మాచారం, దూపహాడ్, లింగాల క్రాస్‌రోడ్‌ మీదుగా ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఎండనక, వాననక పాదయాత్ర చేస్తున్నది వైఎస్సార్‌ పాలన కోసమే. కేవలం వైఎస్సార్‌ను ప్రేమించిన ప్రజలు ఆగం అవుతున్నారని పార్టీ పెట్టా. వైఎస్సార్‌ ప్రతి పథకాన్ని అమలు చేస్తా’అని హామీ ఇచ్చారు. దూపహాడ్‌ గ్రామంలో షర్మిల పాదయాత్రకు మద్దతు తెలుపుతూ బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ యాదవ్‌ గొంగడి, గొర్రెపిల్లను బహూకరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి, కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జి వేణు, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు నీలం రమేశ్‌ పాల్గొన్నారు. 

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)