Breaking News

హిల్ట్‌ పాలసీపై చర్చ .. ‘అవి ప్రభుత్వ భూములు కావు’

Published on Tue, 01/06/2026 - 15:24

సాక్షి, హైదరాబాద్‌: పారిశ్రామిక వేత్తల భూములను.. ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారని.. అవి ప్రభుత్వ భూములు కావు.. పరిశ్రమలకు అమ్మిన భూములు అంటూ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టత నిచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో హిల్ట్‌ పాలసీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వాలన్నదే తమ ఆలోచన అని.. పర్యావరణం బాగుచేయాలనే ఆలోచనతోనే హిల్ట్‌ పాలసీ తీసుకువచ్చినట్లు తెలిపారు.

‘‘హిల్ట్‌ పాలసీ కింద ఆరు నెలల గడువు ఇస్తాం. స్వచ్ఛందంగా ముందుకొస్తేనే భూములు కన్వర్ట్‌ చేస్తాం. పాలసీ గురించి అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. దశాబ్ధాల కిందటే గత ప్రభుత్వాలు వారికి భూములు అమ్మేశాయి. రాజకీయాల పక్కనపెట్టి ఆలోచించాలి’’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వలేని నాగరికత అసమర్థ నాగరికతే.. అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం జరుగుతోందని శ్రీధర్‌బాబు హెచ్చరించారు.

‘‘డెవలప్‌మెంట్ అంటే ప్రకృతిని నాశనం చేయడం కాదు. పిల్లలకు ఆస్తులు కాదు.. క్లీన్ ఎన్విరాన్‌మెంట్‌ నిజమైన వారసత్వం. బంగారు గిన్నెలో విషం పెట్టినట్లవుతోంది మన పరిస్థితి. ప్రకృతి నాశనమైతే తిరిగి రాదు. మనమంతా భూమి యజమానులు కాదు. కేవలం ట్రస్టీలమే. ఫ్యూచర్ జనరేషన్లకు క్లీన్ ఎన్విరాన్‌మెంట్ ఇవ్వడం మన బాధ్యత. ఇది కేవలం ల్యాండ్ యూజ్ మార్పు కాదు. ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం.

..ఓఆర్ఆర్ లోపల పరిశ్రమలు.. ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం. ఫ్యాక్టరీ గోడ పక్కనే ఇళ్లు.. ఇది సైంటిఫిక్ డిజాస్టర్. 1970లలో నగరం బయట పరిశ్రమలు.. నేడు నడిబొడ్డు ప్రాంతాలు బాలానగర్, సనత్‌నగర్, ఉప్పల్ ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్లు. పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించడమే లక్ష్యం. పిల్లలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వడమే ప్రభుత్వ సంకల్పం. హిల్ట్‌పై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. మతలబు ఉందంటూ విమర్శలు బాధాకరం. తెలంగాణ నుంచే పర్యావరణ రక్షణకు చారిత్రక అడుగు.. మార్పు ఎప్పుడో కాదు.. ఇప్పుడే’’ అంటూ శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు.

 

 

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)