Breaking News

TG: స్పీకర్‌ ముందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు

Published on Mon, 09/29/2025 - 07:52

­­­సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్ విచారణ ప్రారంభించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం జరగనున్న ఈ విచారణకు తన అడ్వకేట్లతో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ విచారణకు హాజరయ్యారు.  కాసేపట్లో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరకానున్నారు.

వచ్చే నెల ఒకటో తేదీన కూడా ఈ నలుగురిని ప్రత్యక్షంగా విచారించాలని స్పీకర్‌ నిర్ణయించారు. ఆ షెడ్యూల్‌ను ఇప్పటికే అసెంబ్లీ వర్గాలు అధికారికంగా విడుదల చేశాయి. ఒక్కో ఎ­మ్మె­ల్యే విచారణ గంటపాటు జరగనుంది. ఎమ్మెల్యే, ఆయన తరఫు న్యాయవాది, అనర్హత పిటిషన్‌ దాఖలు చేసిన ఎమ్మె­ల్యే, ఆయన తరఫు న్యాయవాది సమక్షంలో అసెంబ్లీ స్పీకర్‌ ట్రిబ్యునల్‌ ఈ విచారణ నిర్వహిస్తుంది.

కఠిన ఆంక్షలు 
అనర్హత పిటిషన్లపై ప్రత్యక్ష విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో కఠిన ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు సోమవారం నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు అమల్లో ఉంటాయని ఆదివారం అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.

👉ముందస్తు అనుమతి లేకుండా అసెంబ్లీ ప్రాంగణంలోకి సందర్శకులకు అనుమతి ఉండదు
👉మీడియా ప్రతినిధులకు ప్రవేశం లేదు. మీడియా పాయింట్‌తో పాటు అసెంబ్లీ భవనాల్లో ఎక్కడా ప్రెస్‌ మీట్‌ నిర్వహించకూడదు.
👉మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశం ఉండదు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చినా వారి శాసనసభాపక్ష కార్యాల­యాలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది
👉విచారణ జరిగే హాలులోకి పిటిషనర్లు, వారి న్యాయవాదులు, విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, వారి న్యా­య­వాదులెవరూ మొబైల్‌ ఫోన్లను తీసుకెళ్లకూడదు. ఎవ­రైనా విచారణ ప్రక్రియను రికార్డు చేసేందుకు ప్రయత్నించినా, ఫొటోలు తీసినా ఆ ఉపకరణాలను అసెంబ్లీ వర్గాలు స్వా«దీనం చేసుకుంటాయి. ఇందుకు బాధ్యులైన వారి న్యాయవాదులను విచారణ ప్రక్రియలో పాల్గొనేందుకు కూడా అనుమతించరు.

ఏ ఎమ్మెల్యే ఎప్పుడంటే..!
టి. ప్రకాశ్‌గౌడ్‌- ఉదయం 11–12 గంటల వరకు
కాలె యాదయ్య 12 నుంచి ఒంటిగంట వరకు 
గూడెం మహిపాల్‌రెడ్డి మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు 
బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 3 నుంచి నాలుగు గంటల వరకు 
(అక్టోబర్‌ ఒకటో తేదీన కూడా ఇదే సమయాల్లో ఆయా ఎమ్మెల్యేలను మరోమారు విచారించనున్నారు)   

 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)