Breaking News

TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ విడుదల

Published on Sat, 09/27/2025 - 15:22

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ విడుదలైంది. ఎల్లుండి(సోమవారం, సెప్టెంబర్‌ 29) నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభం కానుంది. అనర్హత పిటిషన్లపై ఎల్లుండి నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను విచారించనునున్నారు. 12 గంటలకు కాలె యాదయ్య, ఒంటిగంటకు మహిపాల్‌రెడ్డి, మధ్యాహ్నం  3 గంటలకు బండ్ల కృష్ణమోహన్‌ విచారణకు హాజరుకానున్నారు. అక్టోబర్‌ 1న మరోసారి విచారణ కొనసాగనుంది.

కాగా, పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌లు నిన్న (శుక్రవారం) రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను కలిశారు. మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఒక్కో ఎమ్మెల్యే స్పీకర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

స్పీకర్‌ ఇచ్చిన నోటీసులకు సమాధానమిచ్చేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్‌ను కోరినట్టు సమాచారం. అయితే, ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసులపై ఈ నెల 29వ తేదీ నుంచి స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ప్రత్యక్ష విచారణకు ఇవాళ షెడ్యూల్‌ విడుదలైంది.

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)