Breaking News

మళ్లీ ‘బషీర్‌బాగ్‌’ ఉద్యమం

Published on Sat, 02/11/2023 - 03:16

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రస్తుతం రాష్ట్రంలో 2003కు ముందు మాదిరి విద్యుత్‌ కోతలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. అప్పటి విద్యుత్‌ సంక్షోభం కారణంగా జరిగిన బషీర్‌బాగ్‌ ఉద్యమం నేపథ్యంలో ఆనాటి ప్రభుత్వం కుప్పకూలిందని, ఇప్పుడు మరోసారి బషీర్‌బాగ్‌ తరహా ఉద్యమం చేపట్టాలి్సన అవసరం ఉందని అన్నారు. రేవంత్‌ హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర శుక్రవారం ఉదయం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లచ్చతండా నుంచి ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతో పాటు రాత్రి కొత్త లింగాల క్రాస్‌ వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సాధ్యం కాదన్న ఉచిత విద్యుత్‌ను కాంగ్రెస్‌ పార్టీ అమలు చేసి చూపిందని, కానీ రైతులకు 24 గంటల విద్యుత్‌పై ఆడంబరపు ప్రకటనలు చేసిన సీఎం కేసీఆర్‌ అందులో విఫలమయ్యారని విమర్శించారు. ఆయనకు ప్రజలు ఇచ్చిన అవకాశం ముగిసిందని చెప్పారు.

విద్యుత్‌ కొనుగోళ్లలో వేలకోట్ల కుంభకోణం
విద్యుత్‌ కొనుగోళ్లలో రూ.వేలకోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్‌ ఆరోపించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలు రూ.60 వేల కోట్ల అప్పుల్లో ఉండగా, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ ఒప్పందం లోపభూయిష్టంగా మారిందని చెప్పారు. పదిహేనేళ్ల క్రితం రిటైర్‌ అయిన ప్రభాకర్‌రావు, రఘుమారెడ్డి, గోపాలరావులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీఎండీలుగా అందలం ఎక్కించారని విమర్శించారు. కేసీఆర్‌ చెప్పిన దగ్గరల్లా సంతకాలు పెట్టి.. వేల కోట్ల దోపిడీకి సహకరించినందుకే వారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌ గోల్‌మాల్‌పై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించి, అధికారులను ఊచలు లెక్కబెట్టేలా చేస్తామని పేర్కొన్నారు. 

భూకుంభకోణాలపై విచారణ కోరండి
తెల్లాపూర్‌కు సంబంధించిన 100 ఎకరాల భూ కుంభకోణం, మియాపూర్‌ భూముల కుంభకోణం, కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌తో పాటు సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్‌ కలెక్టరేట్ల పరిధిలో జరిగిన భూ లావాదేవీలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు లేఖ రాయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ ఆస్తుల మీద, తన ఆస్తుల మీద, వారి వారి శాఖలు తీసుకున్న నిర్ణయాల మీద, తాను ఎమ్మెల్యేగా, ఎంపీగా తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టు జడ్జితో విచారణ కోరుతూ లేఖ రాద్దామని సవాల్‌ చేశారు. 

ఏసీడీ చార్జీలు చెల్లించొద్దు
వినియోగదారులెవరూ ఎవరూ ఏసీడీ చార్జీలు చెల్లించవద్దని రేవంత్‌రెడ్డి సూచించారు. తమ ప్రభుత్వం వచ్చాక చార్జీలు రద్దు చేస్తామని ప్రకటించారు. ఈఆర్సీ చైర్మన్‌ శ్రీరంగారావు..మంత్రి హరీశ్‌రావు సోదరుడే కావడంతో ‘చట్టంలో నిబంధన ఉంది, ఏసీడీ చార్జీలు వసూలు చేయొచ్చు’అని ఆయన చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరిగే దోపిడీకి లబ్ధిదారులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అని రేవంత్‌ ఆరోపించారు. కమ్యూనిస్టులు దోపిడీదారుల పక్షాన ఉంటారా, ప్రజల పక్షాన కొట్లాడతారో నిర్ణయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని కోరారు. 

జవాన్‌ కుటుంబం వినతి
జనవరి 5న విధుల్లో ఉండగా మరణించిన జవాన్‌ భూక్యా రమేష్‌ కుటుంబ సభ్యులు యాత్రలో రేవంత్‌రెడ్డిని కలిశారు. జీవనాధారం లేక ఇబ్బంది పడుతున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉపాధి, ఉద్యోగం చూపించేలా చూడాలని కోరారు. ఈ యాత్రలో మాజీ ఎంపీ పోరిక బలరాంనాయక్, నేతలు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌పై అనుచిత వాఖ్యలు చేశారంటూ రేవంత్‌రెడ్డిపై మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి కేసు నమోదైంది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)