Breaking News

బండి సంజయ్‌కి టీపీసీసీ చీఫ్‌ కౌంటర్‌

Published on Sat, 01/25/2025 - 16:43

సాక్షి,హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌కి పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం(జనవరి25) మహేష్‌కుమార్‌గౌడ్‌ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి ని గౌరవిస్తాం. ఇంధిరమ్మ త్యాగం ముందు మీరు, మీ మోదీ ఎంత. ఇంధరమ్మను బండి సంజయ్ అవమానిస్తున్నారు. 

బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ మాట ఇస్తే మడమ తిప్పదని రేపు నాలుగు పథకాలు ప్రారంభించి మరోసారి నిరూపించుకోబోతున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పండుగ జరుపుకోవాలి. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇండ్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుతో అయినా గత పాలకులకు కనివిప్పు కలగాలి. 

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల అనుచరులకే సంక్షేమ పథకాలు వచ్చాయి. మా ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలే లబ్ధిదారుల లిస్ట్‌లో పేరు లేదని ఫిర్యాదు చేస్తున్నారు. మేం ఎవరిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. తప్పు చేస్తే  మాత్రం చర్యలు తప్పవు’అని మహేశ్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. 

బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: Mahesh Kumar

కాగా, ఇందిరమ్మ(Indiramma house) పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా కేంద్రం ఇవ్వదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay) షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన’(Pradhan Mantri Awas Yojana) పేరు పెడితేనే నిధులిస్తామంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ ఫొటోలు పెడితే రేషన్‌ కార్డులు ఇవ్వం.. మేమే ముద్రించి ప్రజలకు రేషన్‌కార్డులు ఇస్తామని బండి సంజయ్‌ చెప్పారు.

కరీంనగర్‌లో మేయర్, కార్పొరేటర్లు బీజేపీలోకి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి గుర్తించి బీజేపీలో చేరడం సంతోషమన్నారు బీఆర్ఎస్ హయాంలో చాలా ఇబ్బందులు పెట్టారు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్‌లో ఉన్న సునీల్‌రావు కూడా ఏం చేయలేకపోయారు. నేను హైదరాబాద్‌లో మీటింగ్‌లో గొడవ చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాక నిధులు విడుదల చేశారని బండి సంజయ్‌ చెప్పారు. 
 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు