Breaking News

హరీశ్‌రావు పక్కచూపులు చూస్తున్నారు: పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌

Published on Mon, 11/18/2024 - 15:22

సాక్షి,హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ కీలక నేత హరీశ్‌రావుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌ సవాల్‌ విసిరారు. గత పదేళ్లో ఎంత అభివృద్ధి చేశారో హరీశ్‌రావు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తామన్నారు. ఈ మేరకు మహేష్‌గౌడ్‌ సోమవారం(నవంబర్‌ 18) సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ ఉండదన్నారు. హరీశ్‌రావు వేరే దారి వెతుక్కుంటున్నారన్నారు. ఆయన ఇప్పటికే పక్క చూపులు చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌లో మిగిలేది కేసీఆర్‌,కేటీఆర్‌,కవితలేనని మహేష్‌గౌడ్‌ ఎద్దేవా చేశారు.

మహేష్‌కుమార్‌గౌడ్‌ ఇంకా ఏమన్నారంటే...

  • కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదు
  • సీఎం రేవంత్‌ని వ్యతిరేకించినా అది పార్టీ కోసమే కానీ వ్యక్తిగతం కాదు
  • కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ ఉన్నారు...ఆ విషయం తెలుసు
  • మీకు ఆ హక్కుంది...మేము మీకు అండగా ఉంటాం
  • జనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తాం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటాలి
  • అధికారంలోకి వచ్చి 11  నెలల్లోనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి
  • బీజేపీ,బీఆర్‌ఎస్‌ కుమ్మకై కాంగ్రెస్ పార్టీపై కుట్ర పన్నుతున్నాయి
  • కార్యకర్త కూడా సీమని కలిసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది
  • కార్యకర్తలు నారాజ్ అయితే మేం కుర్చీ దిగాల్సిందే
  • మరోసారి మనం అధికారంలోకి రావాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి
  • కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుంది
  • బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయ్యింది
  • కాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు బారుతున్నాయి
  • కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు 70 ఏళ్లయిన చెక్కు చెదరలేదు
  • హరీష్ రావుకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్
  • మీరు పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పండి
  • మేము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తాం
  • వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో  బీఆర్‌ఎస్‌ ఉండదు
  • హరీశ్‌రావు కూడా పక్క చూపులు చూస్తున్నాడు
  • చివరికి పార్టీలో తండ్రి, కొడుకు, కూతురు తప్ప ఎవరూ మిగలరు

 

 

 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)