Breaking News

తెలంగాణలో ఏడుగురు కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణం

Published on Mon, 04/07/2025 - 13:05

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Sukhender Reddy) ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇటీవల తెలంగాణలో జరిగిన రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన అంజిరెడ్డి, మల్క కొమురయ్య ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ఎమ్మెల్సీలతో మండలి గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy), ఎంపీలు రఘునందన్‌రావు, లక్ష్మణ్‌ హాజరయ్యారు.

అలాగే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలగా (MLA quota MLCs) కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవం ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యంలతో కూడా గుత్తా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇదే సమయంలో నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ (P.R.T.U) అభ్యర్థి శ్రీపాల్‌ రెడ్డి (Sripal Reddy) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)