Breaking News

చేరికలపై దూకుడు.. టీ కాంగ్రెస్‌ సైలెంట్‌ ఆపరేషన్‌..

Published on Thu, 07/06/2023 - 13:45

సాక్షి, హైదరాబాద్‌: చేరికలపై తెలంగాణ కాంగ్రెస్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడానికి టీ కాంగ్రెస్‌ సైలెంట్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ఈ చేరికలను కాంగ్రెస్‌ నేతలతో కాకుండా న్యూట్రల్‌ పర్సన్స్‌తో ఆపరేషన్‌ ఆకర్షగా కంప్లీట్‌ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మాజీ  మంత్రులు, మాజీ ఎమ్మెల్యేతో చర్చలు పూర్తయినట్లు సమాచారం.

వరంగల్‌ మోదీ సభ రోజే ఒకరిద్దరు కీలక నేతలను చేర్చుకునేందుకు హస్తం పార్టీ ప్లాన్‌ చేసింది. ప్రియాంక హాజరుకానున్న సభలో మరికొందరు కీలక నేతలను చేర్చుకునే యోచనలో తెలంగాణ కాంగ్రెస్‌ ఉంది. యెన్నంశ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రామారావు పటేల్‌, పాల్వాయి హరీష్‌రావు, ఖాజీపేట లింగయ్య, పవన్‌కుమార్‌రెడ్డి, రమేష్‌ రాథోడ్‌, రవీంద్రనాయక్‌, తీగల కృష్ణారెడ్డిలతో మంతనాలు జరుగుతున్నట్లుగా సమాచారం.

ఇదిలా ఉండగా, ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ నేతలు కలుసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. కాంగ్రెస్‌లో తిరిగి చేరడంపై పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డికి ఘర్‌ వాపసిపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆహ్వానం పలికారు.
చదవండి: సమయం తక్కువ.. సవాళ్లు ఎక్కువ!

కాగా, అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు నెలలు సమయం ఉండగానే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. రాజకీయ వర్గాలు ముందుగా ఊహించినట్టుగానే ఖమ్మం గడ్డపై నుంచి ఆ పార్టీ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ జనం నడుమ ఖమ్మంలో జరిగిన బహిరంగ సభ ఎన్నికల ప్రచార సభను తలపించిన సంగతి తెలిసిందే.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)