Breaking News

కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ఆలస్యం?

Published on Mon, 09/04/2023 - 07:53

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొనసాగిస్తోంది.  ఈ క్రమంలో జాబితా ఆలస్యం అయ్యే అవకాశాకాలు కనిపిస్తున్నాయి. అందుకు కారణాలు.. స్క్రీనింగ్‌ కమిటీ 6వ తేదీదాకా హైదరాబాద్‌లోనే ఉండడం, అలాగే పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌తో భేటీ కావాల్సి ఉండడమేనని తెలుస్తోంది. 

ఇవాళ  స్క్రీనింగ్ కమిటీ ముందుకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ నివేదిక చేరనుంది. గాంధీభవన్‌లో ఉదయం 11 నుంచి పీఈసీ సభ్యులతో వ్యక్తిగతంగా సమావేశం కానుంది స్క్రీనింగ్ కమిటీ. సాయంత్రం వరకు రెండు సెషన్స్‌లో ఈ వన్‌ టు వన్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. ప్రదేశ్‌ఎన్నికల కమిటీ సభ్యులు నిన్నంతా గాంధీభవన్‌లో తమ తమ అభిప్రాయాలతో అభ్యర్థుల పేర్లతో నివేదిక రూపొందించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లకు ముందు టిక్‌ను ఉంచారు వాళ్లంతా. దీంతో.. ఇవాళ పీఈసీ సభ్యులతో సమావేశమై.. ఆ సీల్డ్‌ కవర్‌ను పరిశీలిస్తుంది. వాళ్ల నుంచి ఆయా అభ్యర్థుల ఎంపికకు గల కారణాలను అడిగి తెలుసుకుంటుంది స్క్రీనింగ్‌కమిటీ. 

ఇక రేపు(మంగళవారం) గాంధీ భవన్‌లోనే.. రేపు పీఈసీలో లేని మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో స్క్రీనింగ్‌ కమిటీ భేటీ అవుతుంది. పీఈసీ,ఇతర సీనియర్ నేతల అభిప్రాయం మేరకు 6 తేదీన అభ్యర్థుల ఎంపికపై నివేదికను సిద్ధం చేస్తుంది. చివరకు.. 7 తేదీన సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిక సమర్పించాల్సి ఉంది.

అయితే.. ఏడవ తేదీన  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌తో స్క్రీనింగ్‌ కమిటీ భేటీ కావాలని నిర్ణయించింది. దీంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరికొన్ని రోజులు ముందుకు పోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఉన్నాయి.  దీంతో.. సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిక చేరినా పరిశీలనకు కొంత సమయం పట్టొచ్చు. అంటే.. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల తర్వాతే.. కాంగ్రెస్‌ తరపున అభ్యర్థుల జాబితా ప్రకటన వెలువడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)