Breaking News

కాంట్రాక్టర్లు, రియల్టర్లు పార్టీ నుంచి పోండి: కోమటిరెడ్డి సీరియస్‌

Published on Wed, 08/16/2023 - 18:56

సాక్షి, యాదాద్రి: పార్టీలో తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని.. బతుకు తెలంగాణే తన అభిమతమని అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. భువనగిరిలో బుధవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరగ్గా..  ఎంపీ కోమటిరెడ్డి హజరయ్యారు. 

ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి.. నాకు ఏ పదవీ అవసరం లేదు.. నాకు బతుకు తెలంగాణ కావాలి. ప్రతి పార్లమెంట్‌ పరిధిలో 2 సీట్లు కచ్చితంగా బీసీలకు కేటాయించాలని సోనియా, రాహుల్‌ను కోరాను. బలహీనవర్గాలను అవమానపరిస్తే ఖబడ్దార్‌. కాంట్రాక్టర్లు, రియల్టర్లు పార్టీ నుంచి వెళ్లిపోండి. సామాజిక తెలంగాణ ఇంకెప్పడొస్తుంది కేసీఆర్‌? అని అధికార పక్షాన్ని నిలదీశారాయన. కేసీఆర్‌ కేబినెట్‌లో ఎక్కువమంది ఓసీలే. 

..నాకు వ్యాపారాలు లేవు, గుట్టలు, కొండలు అమ్ముకోను అంటూ పరోక్ష విమర్శలు చేశారాయన. గుత్తా సుఖేందర్ రెడ్డి వియ్యంకుడికి గందమల్ల రిజర్వాయర్ పనులు అప్పగించారని, ఔటర్ రింగ్ రోడ్డును కాంట్రాక్టర్లు అప్పగించి ఆ డబ్బులతో రుణమాఫీ చేస్తున్నామంటున్నారని కేసీఆర్‌ సర్కార్‌పై  ఆరోపణలు చేశారాయన. కేసీఆర్‌ చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ అని విమర్శించారు. పంట నష్టం పది వేల రూపాయలు ఎక్కడని? ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)