Breaking News

మాజీ ఎంపీలూ.. మీరేం చేస్తారు?

Published on Mon, 01/23/2023 - 02:08

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ఎన్నికల్లో గెలుపు కోసం ఏం చేస్తారో చెప్పాలని ఐదుగురు మాజీ ఎంపీలను కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే ప్రశ్నించారు. మాజీ ఎంపీ హోదా, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పట్టు, పరిచయాలతో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం శక్తి మేరకు పనిచేయాలని సూచించారు. ఆదివారం మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్‌ యాదవ్, సిరిసిల్ల రాజయ్య, సురేశ్‌ షెట్కార్, బలరాం నాయక్‌లు గాంధీభవన్‌లో ఠాక్రేను కలి శారు.

ఈ సందర్భంగా వారు రాష్ట్రంలోని పార్టీ పరి స్థితులు, ఇతర రాజకీయ పార్టీల బలాలు, బలనతలు, బీజేపీ వైఖరి, బీఆర్‌ఎస్‌ ఏర్పాటు వల్ల మారే రాజకీయాలపై చర్చించారు. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేయాలని ఠాక్రే సూచించారు. ఫిబ్రవరి ఆరు నుంచి జరగనున్న హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రల్లో భాగంగా రాష్ట్రంలో వీలైనన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాల న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలంగా ఉందని, మార్గనిర్దేశం చేసే నాయకులు ఏకమైతే అధికారంలోకి రావడం కష్టమేమీ కాదని మాజీ ఎంపీలు వివరించినట్టు సమాచారం. రాష్ట్రంలోని పార్టీ నేతలందరినీ ఏకం చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరినట్టు తెలిసింది. 

Videos

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

YSR విగ్రహానికి ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో అక్రమ కేసులు

Manohar: కోర్టు తీర్పులను ఉల్లంఘించిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం

Khammam: ఏవో తాజుద్దీన్ హామీతో ధర్నాను విరమించిన రైతులు

Photos

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)