Breaking News

ఢిల్లీకి సీఎం రేవంత్‌..మంత్రివర్గ విస్తరణపై ఫోకస్‌..!

Published on Tue, 01/14/2025 - 19:27

సాక్షి,హైదరాబాద్‌: ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ పార్టీ(ఏఐసీసీ) నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం(జనవరి14) సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు, పలువురు కాంగ్రెస్‌ నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం అనంతరం సీఎం,పీసీసీ అధ్యక్షుడు ఏఐసీసీ నేతలను రేవంత్‌రెడ్డి కలిసే అవకాశముంది. 

ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై రేవంత్‌రెడ్డి అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.కాగా,ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ అధికారులు  16న ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్తారు. ఈనెల 19 వరకు సింగపూర్‌లో పర్యటించనున్న వీరు తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు చేసుకుంటారు. 

వీటితో పాటు కొత్త పెట్టుబడులపై సీఎం బృందం సింగపూర్‌లో పారిశ్రామిక వేత్తలతో చర్చించనుంది. సింగపూర్‌ పర్యటన తర్వాత ఈనెల 20 నుంచి 22 వరకు రేవంత్‌రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు.గతేడాది కొత్తగా సీఎం అయిన తర్వాత రేవంత్‌రెడ్డి తొలిసారిగా దావోస్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.‌  

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా మంతత్రివర్గ విస్తరణపై చర్చ జరగడం సాధారణమైపోయింది. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినప్పటికీ ఇప్పటికీ మంతత్రి వర్గ విస్తరణ జరగలేదు. మంత్రి వర్గ విస్తరణ కోసం ఇటు కాంగగ్రెస్‌ పార్టీ తరపున గెలిచిన సీనియర్‌ ఎమ్మెల్యేలు, అటు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో కొందరు  ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.   

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)