Breaking News

కౌంటింగ్‌ వేళ నిర్లక్ష్యం వద్దు: సీఎం

Published on Tue, 06/04/2024 - 05:43

సాక్షి, హైదరాబాద్‌: కౌంటింగ్‌ రోజున ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థులు, కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లే ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం ఎ.రేవంత్‌రెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా ఉండవద్దని, పోటాపోటీగా ఉంటాయని భావిస్తున్న చోట్ల మరింత అప్రమత్తంగా ఉండి కౌంటింగ్‌ పూర్తయ్యేంతవరకు కేంద్రాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు.

నేడు లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోమవారం సీఎం రేవంత్‌ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఇంచార్జి మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులతో జూమ్‌ ద్వారా సమావేశమయ్యారు. సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్‌మున్షీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ కూడా పాల్గొన్నారు. 

నిబద్ధత ఉన్న కార్యకర్తలనే ఏజెంట్లుగా 
జూమ్‌ సమావేశంలో భాగంగా రేవంత్‌ మాట్లాడు తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిబద్ధత కల కార్యకర్తలను మాత్రమే ఏజెంట్లుగా పంపాలని, సీ నియర్‌ నేతలను కూడా కౌంటింగ్‌ కేంద్రాల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. పోలైన ఓట్లతో 17సీ లిస్ట్‌ సరిపోలాలని, ఈవీఎంలో లెక్కించిన ఓట్లతో 17సీ లిస్టులోని ఓట్లు సరిపోలకపోతే వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అన్ని విషయాలపై అవగాహన ఉన్న వారిని ఏజెంట్లు పంపేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏజెంట్లంతా కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు అక్కడే ఉండేలా చూడాలని ఎంపీ అభ్యర్థులకు సీఎం రేవంత్‌ దిశానిర్దేశం చేశారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)