Breaking News

బండి Vs ఈటల.. బీజేపీలో సోషల్‌ మీడియా పోస్టుల చిచ్చు

Published on Wed, 07/12/2023 - 08:15

సాక్షి, హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు బీజేపీ సోషల్‌ మీడియా వింగ్‌లో కలకలం రేపాయి. ఈ పోస్టులపై సోషల్‌వింగ్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే రెండు వర్గాలుగా విడిపోయింది. కొన్నిరోజుల కిందటివరకు నేతల గ్రూపుల విభేదాలు బయటపడగా.. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు తాజా వివాదానికి కారణమయ్యాయి. రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కించపరిచే విధంగా పోస్ట్‌లు పెడుతున్నారని పలువురు ఈటల వర్గీయులు సోషల్‌ మీడియా వింగ్‌ వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేతల కేంద్రంగా కాకుండా, పార్టీకి మేలు చేసేలా పోస్టులు ఉండాలని సూచించారు. బండి సంజయ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించొచ్చని వార్తలొచ్చిన సందర్భంగా అటు బండి వర్గం, ఇటు ఈటల వర్గం ఒకరికి ఒకరు వ్యతిరేకంగా సోషల్‌ మీడియా­లో పోస్టులు పెట్టారు. దీంతో తాజాగా పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జుల సమావేశానికి నాంపల్లి కార్యాలయానికి వచ్చిన ఈటల వర్గీయులు... ఈటలకు వ్యతిరేకంగా కొందరు పోస్టులు పెట్టడంపై స్టేట్‌ ఆఫీస్‌ సోషల్‌ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా బండి, ఈటల వర్గాలు పరస్పరం దూషించుకున్నాయి. బీజేపీ సోషల్‌ మీడియా ఉద్యోగి ప్రశాంత్‌పై కొందరు దూషణకు దిగారు. వీరిలో ఈటల, కిషన్‌ రెడ్డి అనుచరులు అమర్‌ నాథ్, గిరివర్ధన్‌ రెడ్డి ఉన్నట్లు సమాచారం. సోషల్‌ మీడియా రూమ్‌కు తాళం వేసి మరీ దాడికి ప్రయత్నించినట్టు, ఈటలకు అనుకూలంగా కొందరు నినాదాలు కూడా చేసినట్టు  తెలుస్తోంది. బీజేపీ కార్యాలయ సిబ్బంది ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది.  
చదవండి: రేవంత్‌ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్‌.. చేజేతులా!

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)