Breaking News

‘ఆలీబాబా నలభై దొంగల్లాంటి మంత్రి మండలి.. కేసీఆర్‌ పాలన ఇదే!’

Published on Fri, 04/07/2023 - 18:11

సాక్షి, కరీంనగర్‌: పోలీసులు తెలంగాణాలో సీఎం కేసీఆర్ ఎలా చెబితే అలా ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్‌లదీ అదే దుస్థితి అని మండిపడ్డారు. ఈ మేరకు కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక పార్లమెంట్ సభ్యుడిని ఎలాంటి నోటీస్, వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. అయినా న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. 

తెలంగాణా యువత కోసం పోరాటం చేసినందుకు సంజయ్‌ను అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు కేరాఫ్‌గా మారిందని తరుణ్‌ చుగ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అనాగరిక, ఆటవిక పాలన కొనసాగుతోందని, ఒక లోక్ సభ సభ్యుడికే రక్షణ లేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటని సూటిగా ప్రశ్నించారు. రాత్రికి రాత్రే ఓ ఆతంకవాది తరహాలో ఓ పార్లమెంటేరియన్‌ను అరెస్ట్ చేసిన విధానం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పేపర్ లీక్ మాఫియా నడుస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల్లో కేసీఆర్ పాలనపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తమవుతోంది.. ఆలీబాబా నలభై దొంగల్లాంటి మంత్రి మండలిని పెట్టుకుని నియంతృత్వ పాలన చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పేపర్ లీకేజీ మాఫియా వెనుక ఎవరున్నారో కేసీఆర్ చెప్పాలని, ఆ కింగ్ పిన్ ఎవరో బయటపెట్టాలని తరుణ్‌ చుగ్‌ డిమాండ్‌ చేశారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు