Breaking News

సోఫా, ఏసీ, ట్యాప్‌లు ఎత్తుకెళ్లారు: తేజస్వి యాదవ్‌పై బీజేపీ ఆరోపణలు

Published on Mon, 10/07/2024 - 15:24

రాష్ట్రీయ జనతాదళ్‌ నేత, బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. పాట్నాలోని ఉప ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేేసే సమయంలో అందులోని సామాన్లను దొంగిలించారని ఆరోపించింది. అధికారిక బంగ్లాలోని ఏసీ, సోఫాలు, బెడ్‌, వాషూరూమ్‌లో ట్యాప్స్‌ వంటి అనేక వస్తువులు మాయమయ్యాయని తెలిపింది. 

బిహార్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వ్యక్తిగత కార్యదర్శి శత్రుధన్ కుమార్ ఈ ఆరోపణలు చేశారు. తాము ఆరోపణలు మాత్రమే చేయడం లేదపి, ఆధారాలు కూడా చూపిస్తున్నామని తెలిపారు. దీనిపై తేజస్వి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. యూపీలో అఖిలేష్ యాదవ్ కుళాయిలు కనుమరుగయ్యేలా చేశారని, ఇక్కడ కూడా అదే జరిగిందని ఆరోపించారు.  అయితే ఈ ఆరోపణలపై ఆర్జేడీ నేత ఇంకా స్పందించలేదు.

కాగా ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం హయాంలో తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోవడంతో డిప్యూటీ సీఎం పదవిని కోల్పోయారు.బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా పాట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గతంలో తోసిపుచ్చింది. ఆయనను ప్రతిపక్ష నేత నివాసానికి మార్చాలని కోర్టు ఆదేశించింది.

ఈ క్రమంలోనే పట్నాలోని ఆయన అధికారిక నివాసాన్ని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరీకి కేటాయిస్తూ ఇటీవల నీతీశ్ కుమార్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆదివారం తేజస్వీ ఈ నివాసాన్ని ఖాళీ చేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)